×
Ad

Pavitranath : తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం.. మొగలిరేకులు ఫేమ్ నటుడు పవిత్రనాథ్ కన్నుమూత..

తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ మరణించారు.

  • Published On : March 2, 2024 / 10:25 AM IST

Telugu Serial Actor Pavitranath Passes Away

Pavitranath : తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ మరణించారు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. లాంటి పలు సీరియల్స్ తో బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ తక్కువ ఏజ్ లోనే మరణించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అయితే పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు

ఇంద్రనీల్, మేఘన.. తమ సోషల్ మీడియాలో.. పవి.. ఈ బాధని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైనవాడివి. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం, నిన్ను చాలా మిస్ అవుతున్నాం, చివరి చూపు కూడా చూడలేదు, నీ ఆత్మకు శాంతి చేకూరాలి అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు అసలు ఏమైంది, ఎలా చనిపోయాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read : NTR 31 : భార్యతో కలిసి బెంగుళూరులో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌, రిషబ్ శెట్టిలతో ముచ్చట్లు.. ఎన్టీఆర్ 31 గురించేనా?

గతంలో పవిత్రనాథ్ పై అతని భార్య సంచలన ఆరోపణలు చేసింది. తనని బాగా టార్చర్ చేసాడని, నా ముందే వేరే అమ్మాయిలతో తిరిగేవాడని, నన్ను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేయగా అప్పుడు పవిత్రనాథ్ వైరల్ అయ్యాడు. ప్రస్తుతం పవిత్రనాథ్ మరణానికి కారణం ఇంకా తెలియలేదు. పలువురు అతనికి నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.