NTR 31 : భార్యతో కలిసి బెంగుళూరులో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టిలతో ముచ్చట్లు.. ఎన్టీఆర్ 31 గురించేనా?
బెంగుళూరులో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత అందరూ సమావేశమయ్యారు.

Jr NTR Meets Prashanth Neel and Rishab Shetty in Bengaluru for NTR 31 Movie Photos goes Viral
NTR 31 Movie : ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర'(Devara) సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర రెండు పార్టులుగా రానుంది. దేవర మొదటి పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 31 కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ భార్యతో కలిసి బెంగుళూరుకు వెళ్ళాడు.
బెంగుళూరులో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్(Prashanth Neel), హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty), హోంబలే ఫిలిమ్స్ నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత అందరూ సమావేశమయ్యారు. దీంతో ఈ మీటింగ్ ఎన్టీఆర్ 31 సినిమా గురించే అని తెలుస్తుంది. నిర్మాతలు కూడా రావడంతో కచ్చితంగా ఈ మీటింగ్ ఎన్టీఆర్ 31 గురించే అని సమాచారం. ఇక ఎన్టీఆర్ భార్య ప్రణతితో కలిసి వెళ్లడం విశేషం. ప్రశాంత్ నీల్ భార్య, రిషబ్ శెట్టి భార్య కూడా అక్కడికి రావడం గమనార్హం.
ఎన్టీఆర్ వీరందరితో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్, ప్రణతి, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ నీల్ భార్య, రిషబ్ శెట్టి, రిషబ్ భార్య, హోంబలే నిర్మాత విజయ్, మైత్రి నిర్మాత రవి శంకర్ ఉన్నారు. ఎన్టీఆర్ స్వయంగా ఈ ఫోటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ 31 లో రిషబ్ ఉండబోతున్నాడా అని సందేహాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ సన్నగా కనిపిస్తుండటంతో అభిమానులు ఎన్టీఆర్ ఏంటి ఇంత సన్నగా అయిపోయారు అని కామెంట్స్ చేస్తున్నారు.