Telugu version of Dhurandhar 2 likely on 2026 March 19
Dhurandhar 2 Telugu Release : రణవీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం బాలీవుడ్ చిత్రం ‘దురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
పాకిస్థాన్ కి వెళ్లి అక్కడ పనిచేసిన ఓ ఏజెంట్ కథతో, రియల్ లైఫ్ లో జరిగిన పాకిస్థాన్- భారత్ కి చెందిన కొన్ని సంఘటనల నేపథ్యంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రం కేవలం హిందీ బాషలో మాత్రమే విడుదలైంది. ఇక తెలుగులో ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా? అని చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Shambhala : ఆసక్తిగా ఆది సాయికుమార్ ‘శంబాల’ ట్రైలర్..
మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తొలుత ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ రోజు తెలుగులో 12 చిత్రాలు విడుదల కానుండడంతో న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న లేదా 2వ తేదీని విడుదల చేస్తారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ అప్పుడే రెండో భాగానికి సంబంధించిన చాలా సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 19 విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలియజేసింది.
Mowgli : సుమ కొడుకు బ్రేక్ ఈవెన్ కొట్టేశాడు.. తొలి వారంలోనే..!
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగులోనూ అదే రోజున విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజం అయితే.. అది తెలుగు ప్రేక్షకులకు పండగే..