Shambhala : ఆసక్తిగా ఆది సాయికుమార్ ‘శంబాల’ ట్రైలర్..
ఆది సాయి కుమార్ నటిస్తున్న చిత్రం ‘శంబాల’(Shambhala). సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు.
Aadi Sai Kumar Shambhala Trailer out now
Shambhala : ఆది సాయి కుమార్ నటిస్తున్న చిత్రం ‘శంబాల’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోండగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో ట్రైలర్ ఆరంభమైంది.
Mowgli : సుమ కొడుకు బ్రేక్ ఈవెన్ కొట్టేశాడు.. తొలి వారంలోనే..!

‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’.. అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపీఠాల్ని తీసుకు రావడం వంటివి చూపించారు. ఈ మిస్టరీని చేధించేందుకు హీరో ఆది రంగంలోకి దిగడం మీ ‘కాశీ, కాకమ్మ, మజిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి.. నాక్కాదు’, ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే’ అనే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది.
