Amitov Teja: డైరెక్టర్ తేజ కొడుకుపై క్రిమినల్ కేసు.. కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలు
టాలీవుడ్ దర్శకుడు తేజ కొడుకు అమితోవ్ తేజ(Amitov Teja)పై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
criminal case registered against director Teja son Amitov Teja.
- ట్రేడింగ్ వ్యవాహారంలో తలెత్తిన వివాదం
- కోర్టుకెళ్లిన బ్యాంకు ఉగ్యోగి ప్రణీత్
- ఇదే వ్యవహారంల మరో కేసు వేసిన తేజ కుమారుడు
Amitov Teja: టాలీవుడ్ డైరెక్టర్ తేజ కుమారుడు అమితోవ్ తేజపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. మోతీనగర్‌కు చెందిన కె. ప్రణీత్ బ్యాంకు క్రెడిట్ కార్డుల పర్యవేక్షణ విభాగంలో పనిచేస్తున్నారు. క్రెడిట్ కార్డు అప్లికేషన్ విషయంలో 2025లో అమితోవ్ తేజ(Amitov Teja)తో ప్రణీత్‌కు పరిచయమయ్యింది.
ఆ తరువాత అమితోవ్ తేజ, ప్రణీత్, అతని భార్య ముగ్గురు కలిసి షేర్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ ప్రారంభించారు. తేజ తరఫున ప్రణీత్ ట్రేడింగ్ చేయగా దాదాపు రూ.11 లక్షల నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మరింత డబ్బు పెట్టాలని అమితోవ్ తేజ ప్రణీత్‌పై ఒత్తిడి తెచ్చాడట. దానికి ప్రణీత్ నిరాకరించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. కేసుల వరకు వచ్చింది.
ఇక ప్రణీత్ చేసిన ఫిర్యాదు మేరకు, అమితోవ్ తేజ అనుచరులు కొంతమంది ప్రణీత్‌ను అక్రమంగా నిర్బంధించారట. ఖాళీ పేపర్లు, చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారట. అంతేకాకుండా, అతని భార్యతో ఆస్తి కాగితాలపై కూడా సంతకాలు తీసుకున్నారట. గతంలోనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా
వారి నుంచి స్పందన లేకపోవడంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించాడట ప్రణీత్.
ఈ విషయాన్ని పరిశీలించిన కోర్టు, కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే వ్యవహారంలో పెట్టుబడి పేరిట ప్రణీత్, అతని భార్య రూ.72 లక్షలు మోసం చేశారని అమితోవ్ తేజ సైతం ఫిర్యాదు చేశారు. ఈమేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఇరవై రోజుల క్రితం మరో కేసు నమోదు చేశారు.
