Parasakthi OTT: శివ కార్తికేయన్, శ్రీలీల డిజాస్టరస్ సినిమా OTTలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
శివ కార్తికేయన్ పరాశక్తి(Parasakthi OTT) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధం అయ్యింది.
sivakarthikeyan Parasakthi movie OTT streaming update.
- ఓటీటీలోకి వస్తున్న ‘పరాశక్తి’
- అధికారిక ప్రకటన చేసిన జీ5
- ఫిబ్రవరిలోనే స్ట్రీమింగ్
Parasakthi OTT: తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’. ఆకాశమే హద్దురా ఫేమ్ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా జయం రవి, అధర్వ మురళి కీ రోల్స్ ప్లే చేశారు. పీరియాడికల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన ఆ అంచనాలను అందుకోలేకపోయింది పరాశక్తి.
Dhurandhar OTT: ఓటీటీలో దురంధర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్
దీంతో, ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. పరాశక్తి ఓటీటీ(Parasakthi OTT) హక్కులను ప్రముఖ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ న్యూస్ తెలియడంతో ఓటీటీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తారు అనేది చూడాలి.
