Vivo T4 Ultra : వివో క్రేజే వేరబ్బా.. భారీగా తగ్గిన వివో T4 అల్ట్రా ఫోన్ .. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Vivo T4 Ultra : వివో కొత్త ఫోన్ కొనేవారి కోసం అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో T4 అల్ట్రా ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Vivo T4 Ultra
- ఫ్లిప్‌కార్ట్‌లో వివో T4 అల్ట్రా బ్యాంక్ ఆఫర్లతో ధర రూ.32వేల లోపే
- ఫ్లాట్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
- అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ చిప్సెట్, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాలు
Vivo T4 Ultra : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? అయితే ఇది మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో T4 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. వివో ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 37,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, పాత స్మార్ట్ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్‌తో పాటు వివో T4 అల్ట్రా ఫోన్ అనేది అమోల్డ్ డిస్ప్లే పవర్ఫుల్ డైమెన్సిటీ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,కెమెరాలు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు.
వివో T4 అల్ట్రా ఫ్లిప్‌కార్ట్ డీల్ :
రూ.37,999 ధరకు లాంచ్ అయిన ఈ వివో ఫోన్ ఇప్పుడు రూ.2వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందిస్తోంది. తద్వారా వివో ఫోన్ ధర రూ.35,999కి తగ్గింది. డిస్కౌంట్‌తో పాటు యూజర్లు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4వేల అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ-కామర్స్ వెబ్సైట్ నెలకు రూ.4వేల నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో వస్తుంది.
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. రూ.29,650 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. అయితే, ఫైనల్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
వివో T4 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
వివో T4 అల్ట్రా ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్ కూడా అందిస్తుంది. ఈ వివో ఫోన్ 4nm మీడియాటెక్ డైమన్షిటీ 9300+, 12GB వరకు ఎల్ పీడీడీఆర్5 ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh సింగిల్-సెల్ బ్యాటరీ కూడా ఉంది. అంతేకాకుండా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS15తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 50ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరాతో 50MP సోనీ IMX 882 పెరిస్కోప్, 8MP అల్ట్రావైడ్ షూటర్ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ వివో ఫోన్ 4K, ఈఐఎస్‌తో 32MP సెల్ఫీ కెమెరా అందిస్తుంది.
