Ind vs NZ : ఐదో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు
తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం ఐదో టీ20 (Ind vs NZ) మ్యాచ్ ప్రారంభమైంది.
IND vs NZ 5th T20 Team India have won the toss and have opted to bat
Ind vs NZ : తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ చేయనుంది.
‘మేము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. నిన్న రాత్రి మేము ఇక్కడ ప్రాక్టీస్ చేశాము. బాగా మంచు కురిసింది. ఈరోజు కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో బౌలర్లు లక్ష్యాన్ని కాపాడుకోగలరో లేదో చూడాలని అనుకుంటున్నాము. తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్లు తిరిగి వచ్చారు. తిరువనంతపురం ప్రజలారా చింతించకండి సంజూశాంసన్ ఈ రోజు ఆడుతున్నాడు. ఇక తిలక్ వర్మ కోసం ఎదురుచూస్తున్నాము. మేము దాదాపు అన్ని విభాగాలను కవర్ చేసాము. ప్రతి గేమ్ ద్వారా ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము. ‘ అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
🚨 Toss Update 🚨#TeamIndia elect to bat in the Final #INDvNZ T20I
Updates ▶️ https://t.co/Thau28CPuZ@IDFCFIRSTBank pic.twitter.com/9Wo6lLsnUs
— BCCI (@BCCI) January 31, 2026
‘ఈ రాత్రికి అంతగా మంచు కురవకపోవచ్చు. తుది జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. కాన్వే స్థానంలో అలెన్, చాప్మన్ స్థానంలో నీషమ్, కెజె, లాకీ జట్టులోకి వచ్చారు.’ అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు.
న్యూజిలాండ్ తుది జట్టు..
టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ
Here’s a look at #TeamIndia‘s Playing XI for the 5⃣th T20I 🙌
Updates ▶️ https://t.co/Thau28CPuZ#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/CjChznpUY0
— BCCI (@BCCI) January 31, 2026
భారత తుది జట్టు..
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
