Mowgli : సుమ కొడుకు బ్రేక్ ఈవెన్ కొట్టేశాడు.. తొలి వారంలోనే..!

యాంక‌ర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ’(Mogli).

Mowgli : సుమ కొడుకు బ్రేక్ ఈవెన్ కొట్టేశాడు.. తొలి వారంలోనే..!

Roshan Kanakala Mowgli movie earns 10 crore

Updated On : December 21, 2025 / 12:28 PM IST

Mowgli : యాంక‌ర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ’. సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. సాక్షి సాగర్‌ మడోల్కర్ క‌థానాయిక‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2025 డిసెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం విడుద‌లైన తొలి వారంలోపే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట‌లోకి వ‌చ్చింది. 8 కోట్లలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లుగా తెలుస్తోంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ వ‌సూళ్లు అన్ని క‌లుపుకుని దాదాపు ప‌ది కోట్ల రూపాయ‌లు సాధించి నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం రెండో వారంలోకి అడుగుపెట్టింది.

Shambhala : శంబాల బడ్జెట్ పెరిగిపోయింది.. హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం..

ఈ మూవీలో రోషన్ నటన ఆకట్టుకుంది. విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను సైతం అందుకుంది.