Kanthamaneni Ravishankar: డైరెక్టర్‌గా తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్.. ‘పంచభూతాల’ కాన్సెప్ట్‌తో భారీ సినిమా

తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ (Kanthamaneni Ravishankar)దర్శకుడిగా మొదటి సినిమాను స్టార్ట్ చేశారు.

TeluguOne Chief Kanthamaneni Ravishankar first movie as Director

  • డైరెక్టర్‌గా మారుతున్న కంఠంనేని రవిశంకర్
  • ‘పంచభూతాల’ కాన్సెప్ట్‌తో భారీ సినిమా
  • 2027 సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్

Kanthamaneni Ravishankar: తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ తన పుట్టినరోజు (మే 19) సందర్భంగా సరికొత్త మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తెలుగువన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రంతో ఆయన సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, తొలిసారిగా ఆయనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టడం విశేషం.

Rakul Preet Singh: పార్ట్‌నర్ మోసం చేస్తే క్షమించొచ్చా.. మాట మార్చిన రకుల్.. షాకింగ్ కామెంట్స్ వైరల్

ప్రకృతిలోని అత్యంత శక్తివంతమైన ‘పంచభూతాల’ను ప్రధాన కథా వస్తువుగా తీసుకుని ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కె.హిమబిందు సమర్పణలో, వై.జతిన్‌కుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది.

ఇటీవల నిర్వహించిన రవిశంకర్(Kanthamaneni Ravishankar) బర్త్‌డే వేడుకల్లో తెలుగువన్ డైరెక్టర్ రమేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఈ కొత్త చిత్రానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. పక్కా ప్లానింగ్‌తో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.