Jana Nayagan : విజ‌య్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఎట్ట‌కేల‌కు జ‌న నాయ‌గ‌న్ సెన్సార్ పూర్తి.. ర‌న్‌టైమ్ ఎంతంటే?

విజ‌య్ హీరోగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ (Jana Nayagan) సెన్సార్ పూరైంది.

Thalapathy Vijay Jana Nayagan censor completed

Jana Nayagan : త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ అభిమానులకు శుభ‌వార్త ఇది. ఎట్ట‌కేలకు ఆయ‌న న‌టించిన జ‌న నాయ‌గ‌న్ సినిమా సెన్సార్ పూరైంది. ఈ చిత్రానికి సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ ‘ఏ’ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ చిత్ర ర‌న్‌టైమ్ ఏకంగా మూడు గంట‌ల మూడు నిమిషాలుగా ఉంది. అంటే 183 నిమిషాలు.

హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా మ‌మిత బైజు, బాబీ దేవోల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కేవీఎస్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Bhagyashri Borse : లెనిన్‌లో భార‌తి పాత్ర స్టిల్స్‌ను షేర్ చేసిన భాగ్య‌శ్రీ బోర్సే.. ఫోటోలు వైర‌ల్..

వాస్త‌వానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. అయితే.. సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా రిలీజ్ కాలేదు. కోర్టు కేసులు, సుదీర్ఘ వాయిదా త‌రువాత ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. ఇక ఈ చిత్రాన్ని జూలై 24 విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తోంది. అయితే.. దీనిని మూవీ యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.