Mega 158: మెగాస్టార్ నెక్స్ట్ మూవీలో బిగ్ ట్విస్ట్.. ఆస్కార్ విన్నర్ స్థానంలో మన క్రేజీ కంపోజర్!
మెగాస్టార్ 158(Mega 158) సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్.
- V Santhosh Kumar
- Published On : March 14, 2026 / 10:50 AM IST
Thaman composing music for Chiranjeevi-Bobby Kolli film.
- బాబీతో మెగాస్టార్ మరో మూవీ
- రహమాన్ స్థానంలో తమన్ ను ఫిక్స్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్
Mega 158: మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ జనరేషన్ లో కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగాస్టార్.. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ‘విశ్వంభర’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం 2026 జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అయితే, ఈ సినిమా పూర్తి కాకముందే మెగాస్టార్ తన 158వ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి (KS రవీంద్ర) తో చిరంజీవి(Mega 158) మరోసారి జతకడుతుండటంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చిరంజీవి సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి హీరోయిన్‌గా నటించనుందట.
ఎవరూ ఉహిచని విధంగా చిరంజీవి- ప్రియమణి కాంబినేషన్ తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇందులో ఆమె మెగాస్టార్‌కు భార్యగా ఒక కీలకమైన, ఎమోషనల్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడి విషయంలో ఒక కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. అదేంటంటే, ఈ సినిమా కోసం మొదట ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్‌ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ భారీ చిత్రానికి మ్యూజిక్ అందించే బాధ్యతను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు అప్పగించారట మేకర్స్.
తమన్ గతంలో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాథర్ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు, మరోసారి మెగాస్టార్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడట. కేవలం దర్శకుడు బాబీ ఈ నిర్ణయం మేరకే ఈ మార్పు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు షరవేగంగా జరుగుతున్నాయి. మార్చి ఆఖరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
