Thaman : నువ్వు దేవుడివి సామి.. విజయ్ ని గెలిపించిన తమన్.. ఆకాశానికెత్తేస్తున్న విజయ్ ఫ్యాన్స్..
విజయ్ గెలుపుకి కారణాల్లో మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఒక కారణం అంటున్నారు. (Thaman)
- Saketh U
- Updated on- May 5, 2026 / 10:12 AM IST
Thaman
Thaman : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ విజయాన్ని అందుకున్నారు. విజయ్ TVK పార్టీ 108 సీట్లు సాధించింది. పొత్తుతో విజయ్ సీఎం అవ్వనున్నారు. విజయ్ గెలుపుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే విజయ్ గెలుపుకి కారణాల్లో మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఒక కారణం అంటున్నారు. తమన్ విజయ్ పార్టీకి ఇచ్చిన పాటలు కూడా గెలుపుకు కారణం అయ్యాయి.
సాధారణంగా రాజకీయ పార్టీలను ప్రజల్లోకి ఎక్కువగా, తొందరగా తీసుకెళ్లాలంటే కావాల్సింది మంచి పాటలు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీల సాంగ్స్ వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పొలిటికల్ సాంగ్స్ తో ఓ ఊపు తెప్పిస్తారు సాంగ్ కంపోజర్స్. ఈ సాంగ్స్ ప్రచారానికి బాగా ఉపయోగపడతాయి. యూత్ ని, మాస్ కార్యకర్తలను పొలిటికల్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. పొలిటికల్ సాంగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే పార్టీకి అంత కలిసొస్తుంది.
Also Read : Huma Qureshi : పెళ్లి చేసుకోబోతున్న మరో హీరోయిన్.. 39 ఏళ్ళ వయసులో..
అలా విజయ్ TVK పార్టీకి మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మూడు పొలిటికల్ సాంగ్స్ ని కంపోజ్ చేసారు. ఆ మూడు సాంగ్స్ కూడా అదిరిపోయే బీట్ తో, పవర్ ఫుల్ గా ఉన్నాయట. TVK పార్టీ ప్రచారంలో తమన్ కంపోజ్ చేసిన పాటలే హైలెట్ గా నిలిచాయట. తమన్ మామూలుగానే అదిరిపోయే డ్రమ్ బీట్స్ తో పవర్ ఫుల్ మ్యూజిక్ ఇస్తాడు. ఇక స్పెషల్ పొలిటికల్ సాంగ్స్ అంటే ఓ రేంజ్ లో ఇచ్చాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ విజయ్ గెలుపుకు కారణం అయ్యాయని, విజయ్ గెలుపులో తమన్ పాత్ర కూడా ఉందని అంటూ తమన్ ని పొగిడేస్తున్నారు.
పలువురు విజయ్ ఫ్యాన్స్ తమన్ ని పొగిడేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తమన్ గతంలో విజయ్ వరిసు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి ఆ సినిమాకు మంచి సాంగ్స్ ఇచ్చారు.
It might be less noticed but one of the reason for tvk victory is their banger campaign songs@MusicThaman garu unreal work for our thalapathy ♥️
Forever greatful for banger songs both in movies and for the party #thaman #TVKVijay
— 𝙀𝙇 𝙍𝙤𝙞 ♐ (@DABtweetingFCB) May 4, 2026
#TVK peeps owns a great deal of gratitude to this man @MusicThaman#Thaman #TVKVijay #2026election pic.twitter.com/AnrwmGiqft
— AanMan (@Mr_13_pulkesi) May 4, 2026
Also See : Vijay : ఎన్నికల్లో గెలిచాక ఫ్యామిలీతో విజయ్ ఫొటోలు..
TVK @actorvijay Win lo 50% Credit Goes To @MusicThaman Anna 🔥 With His
Songs, Mass Anthem 🥵 People loki Drug la Yekkesindhi 💥We Demand DCM Post For #Thaman 😌#TVKVijay #ThalapathyVijay #Vijay #TVKpic.twitter.com/n0wYhapGOG
— Gajala (@Gajala_Mass) May 4, 2026
