Sarkaru Vaari Paata: ఇయర్‌ఫోన్స్, సబ్‌వూఫర్స్ పేలిపోతాయని హెచ్చరిస్తున్న థమన్

ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర ట్రైలర్‌ను మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్....

Thaman Raises Hype On Sarkaru Vaari Paata Trailer

Sarkaru Vaari Paata: ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర ట్రైలర్‌ను మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, మహేష్ ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే సినిమా కంటే ముందే, ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేయనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Sarkaru Vaari Paata : ఇలాంటి కథ ఇప్పట్లో రాదు.. సర్కారు వారి పాట సినిమాపై అనంత శ్రీరామ్

ఇప్పటికే ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్ర ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేశారట చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌పై థమన్ ఓ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘మహేష్ బాబు అభిమానులు గెట్ రెడీ.. మీ ఇయర్‌ఫోన్స్, సబ్‌వూఫర్స్ పేలిపోవడం ఖాయం..’’ అంటూ సర్కారు వారి పాట ట్రైలర్‌పై ఆయన కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌తో మరోసారి సర్కారు వారి పాట ట్రైలర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

Sarkaru Vaari Paata: 105 షాట్స్ ఆఫ్ ట్రైలర్.. సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్ రెడీ

మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో మనం ఈ సినిమాలో చూడబోతున్నట్లు థమన్ పదేపదే చెబుతూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంగీతం, బీజీం కూడా అదే రేంజ్‌లో కుదిరాయని ఆయన అంటున్నారు. మొత్తానికి థమన్ ఈ సినిమా కోసం బాగా కష్టపడినట్లు ఆయన ట్వీట్లు చూస్తుంటే అర్థం అవుతోంది. మరి ఇవాళ సాయంత్రం రిలీజ్ కానున్న సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్‌ను ఎలా షేక్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు. ఇక సర్కారు వారి పాట చిత్రాన్ని పూర్తిగా బ్యాంకింగ్ నేరాల నేపథ్యంలో తెరకెక్కించగా, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.