Ntr New Look: అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ షురూ
తమన్ షేర్ చేసిన ఎన్టీఆర్ న్యూ లుక్(Ntr New Look) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
- V Santhosh Kumar
- Updated on- May 8, 2026 / 01:48 PM IST
Thaman shared ntr new look goes viral on social media
- ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ సెన్సేషన్.
- నోట్లో టూత్ పిక్‌తో రచ్చ.
- ‘డ్రాగన్’ సినిమా లుక్ అంటూ చర్చ.
Ntr New Look: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరికొత్త మేక్ ఓవర్‌తో నెట్టింట తుఫాన్ రేపుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఈ పిక్‌లో తారక్ చాలా స్లిమ్‌గా, లాంగ్ హెయిర్‌తో నోట్లో టూత్ పిక్ పెట్టుకొని చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ.. తమ అభిమాన హీరోలో ఈ మార్పు చూసి ఆనందంతో ఊగిపోతున్నారు.
Sravanthi Chokkarapu: పసుపు వర్ణంలో పసిడి బొమ్మలా.. స్రవంతి చొక్కారావు ట్రెడిషనల్ లుక్ వైరల్
అయితే ఈ స్టైలిష్ లుక్ ఏ సినిమాకు సంబంధించింది అనే దానిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే తదుపరి సినిమాలోని లుక్ అని కొందరు వాదిస్తుంటే, మరికొందరు ఇది ఏఐ (AI) ద్వారా క్రియేట్ చేసిన ఫోటో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ (NTRNeel) కోసమే ఈ విభిన్నమైన రూపాన్ని తారక్ సిద్ధం చేసుకున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్లారిటీ లేని ఉత్కంఠ ఫోటో స్థాయిని మరింత పెంచేస్తోంది.
మరోవైపు, ఎన్టీఆర్(Ntr New Look), ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న ‘డ్రాగన్’ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్‌ను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ థమన్ షేర్ చేసిన ఈ స్టైలిష్ లుక్ కనుక డ్రాగన్ సినిమాలోనిదే అయితే, పుట్టినరోజున రాబోయే వీడియో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడం ఖాయం. ప్రస్తుతం ఈ వైరల్ పిక్ నందమూరి అభిమానులకు అసలైన ‘బత్తర్ డే’ ట్రీట్‌కు ముందు ఒక చిన్న టీజర్‌లా అనిపిస్తోంది.
