×
Ad

Tammareddy Bharadwaja Video: హీరోయిన్లు, అమ్మాయిల పొట్టి బట్టల వివాదంపై తమ్మారెడ్డి హాట్ కామెంట్స్

"మనం లాగులు వేసుకుని తిరగొచ్చా? అమ్మాయిలు మాత్రం లాగులు వేసుకోకూడదా?" అని అన్నారు.

Thammareddy Bharadwaja

  • ఏదైనాగాని సినిమా కథను బట్టి ఉంటుంది
  • అమ్మాయిలు షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు
  • ఒకప్పుడు ఇలా చేస్తే వింతగా చూసేవాళ్లు

Tammareddy Bharadwaja: నేటి సినిమాల్లో దుస్తులు పూర్తిగా కప్పుకుని యాక్ట్ చేయడం కుదురుతుందా? సంస్కారబద్ధంగా బట్టలు ఉండాలని కొందరు అంటున్నారు. గతంలో కొంతమంది హీరోయిన్లు చీరలు కట్టుకుని నటించారని ఇప్పుడు కొందరు గుర్తుచేస్తుంటారు.

తమ బాడీ తమ ఇష్టం అని స్కిన్ షో చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఇటీవల సినీనటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు మంటలు రాజేశాయి. శివాజీ, అనుసూయ మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదాలపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

Also Read: Riddhi Kumar: నాచే నాచే సాంగ్ లో రిద్దీ హాట్ అందాలు.. ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ

10టీవీ పాడ్‌కాస్ట్‌లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… “ఏదైనాగాని సినిమా కథను బట్టి ఉంటుంది. మొత్తం స్క్రీన్ షో చేస్తున్న అమ్మాయి కూడా ఒక పవిత్రమైన క్యారెక్టర్, భక్తి రస చిత్రం తీస్తే చీర కట్టక ఎలా చేస్తుంది? ఇప్పుడు మోడర్న్ డేస్. రోడ్డు మీదకి వెళ్తే అమ్మాయిలు షార్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు.

అలా చిన్న చిన్న బట్టలు వేసి తిరుగుతున్నారు. ఒకప్పుడు వింతగా చూసేవాళ్లు మా చిన్నప్పుడు. ఇవాళ అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. కామన్ అయిపోయింది. అది స్కిన్ షో అని మనం అనుకోవడం తప్పు కదా?

మనం లాగులు వేసుకుని తిరగొచ్చా? అమ్మాయిలు మాత్రం లాగులు వేసుకోకూడదా? తరతరాలుగా ఒక దృష్టితో చూడడం అలవాటు అయిపోయింది పురుషులకి. ఇవాళ్టికి ఇంకా మారలే. బట్టలు అలా వేసుకుంటేనే రేపులు అవుతున్నాయని అనుకుంటే.. చిన్న పిల్లల్ని, 60 ఏళ్ల ముసలమ్మని ఎట్లా రేపులు చేస్తున్నారు?” అని అన్నారు.