×
Ad

Emo Emo Idi: రోషన్ కొత్త సినిమా ‘ఏమో ఏమో ఇది’.. శైలేష్ రోమ్-కామ్ టీజర్ అదిరిందిగా!

రోషన్ మేక కొత్త సినిమా 'ఏమో ఏమో ఇది(Emo Emo Idi)'.

The First Breeze of Emo Emo Idi movie released

Emo Emo Idi: ఛాంపియన్ సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో రోషన్ మేక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే ‘ఏమో ఏమో ఇది(Emo Emo Idi)’. హిట్ సిరీస్ చిత్రాలతో సాలిడ్ హిట్స్ అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కన్నప్ప ఫేమ్ ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్బంగా ‘ఏమో ఏమో ఇది’ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక టీజర్ హేషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంది. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా దసరా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. శైలేష్ తన థ్రిల్లర్ జానర్ ను పక్కన పెట్టి లవ్ స్టోరీతో ముందుకు వస్తున్నాడు. మరి ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది చూడాలి.

Ananya Nagalla: షార్ట్ స్కర్ట్ లో హాట్ బ్యూటీ.. అనన్య అందాలు అదుర్స్.. ఫొటోలు