×
Ad

Rashmika Mandanna : రెమ్యునరేషన్ వద్దన్న రష్మిక.. ఏకంగా డబల్ రెమ్యునరేషన్ ఇస్తున్న తెలుగు నిర్మాతలు..

రష్మిక మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7 న రిలీజ్ కానుంది.(Rashmika Mandanna)

Rashmika Mandanna

Rashmika Mandanna : ప్రస్తుతం రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా అన్ని భాషల్లో దూసుకుపోతుంది. తెలుగు, హిందీలో ఎక్కువగా సినిమాలు చేసి వరుస విజయాలు సాధిస్తుంది. స్టార్ హీరోయిన్ గా రెమ్యునరేషన్ కూడా ఎక్కువే తీసుకుంటుంది. రష్మిక మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7 న రిలీజ్ కానుంది.(Rashmika Mandanna)

ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ నచ్చి రెమ్యునరేషన్ ఏమి వద్దు ఇప్పుడు సినిమా చేసాక చూసుకుందాం అని రెమ్యునరేషన్ తీసుకోకుండానే సినిమా చేసిందని నిర్మాతలు తెలిపారు. నేడు నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు.

Also Read : Shambhala : ఆది సాయి కుమార్ ‘శంబాల’ ట్రైలర్ రిలీజ్.. ఆకాశం నుంచి పడిన రాయితో.. ఇదేదో ఇంట్రెస్ట్ గా ఉందే..

ధీరజ్ మాట్లాడుతూ.. రష్మిక రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ సినిమా చేసింది. కానీ ఇవ్వడం మా బాధ్యత. అందుకే సినిమా అయ్యాక డబల్ రెమ్యునరేషన్ ఇస్తున్నాము అని తెలిపారు. దీంతో రష్మిక కు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ వచ్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం భారీగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. తెలుగులో రష్మిక 5 కోట్లు, అంతకు పైగా తీసుకుంటున్నట్టు టాక్. బాలీవుడ్ లో అయితే 8 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ లెక్కన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మికకు దాదాపు 10 కోట్లు ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.

Also Read : Mega – Allu Family : మెగా – అల్లు ఫ్యామిలీ ఫొటోలు వైరల్.. బన్నీ – చరణ్ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..