Mega – Allu Family : మెగా – అల్లు ఫ్యామిలీ ఫొటోలు వైరల్.. బన్నీ – చరణ్ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..
అల్లు - మెగా ఫ్యామిలీలు ఒకే ఫ్రేమ్స్ లో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. (Mega - Allu Family)
Mega Allu Families
Mega – Allu Family : అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు అల్లు ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ, మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిన్నే అల్లు శిరీష్ తన నిశ్చితార్థ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.(Mega – Allu Family)
తాజాగా ఈ నిశ్చితార్థ వేడుక నుంచి పలు ఫ్యామిలీ ఫొటోలు బయటకు వచ్చాయి. అల్లు – మెగా ఫ్యామిలీలు ఒకే ఫ్రేమ్స్ లో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుకల ఫ్యామిలీ ఫొటోల్లో కాబోయే జంట అల్లు శిరీష్, నయనికతో పాటు శ్రీజ, లావణ్య, అల్లు బాబీ, బాబీ భార్య, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, అల్లు స్నేహ, సురేఖ, అల్లు అరవింద్, పవన్ భార్య అన్న లెజనోవా, అల్లు అరవింద్ భార్య ఉన్నారు.

చిరంజీవి, నాగబాబు అతిధులలో కూర్చున్న ఫొటోలు కూడా వచ్చాయి. బన్నీ – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిశ్చితార్థ వేడుక నుంచి మరిన్ని ఫొటోలు వస్తాయని ఎదురుచూస్తున్నారు మెగా అల్లు ఫ్యామిలీల అభిమానులు.

