Vijay : విజయ్ లాస్ట్ సినిమా ఇదేనా..? విజయ్‌కి ఫేర్‌వెల్ సినిమాలా ఉండాలని.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా The Goat సినిమా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో ఇదే విజయ్ లాస్ట్ సినిమానా అని అంతా చర్చించుకుంటున్నారు.

The GOAT Movie may be Vijay Last Movie Director Venkat Prabhu Sensational Comments goes Viral

Vijay – The GOAT : తమిళ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు ఎన్నికల్లో తన తమిళ కజగం పార్టీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు. 2025 నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో దిగుతాడని తమిళ మీడియా అంటుంది. ఈ లోపు చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేస్తారని అంటున్నారు. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో The Goat (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) సినిమా చేస్తున్నాడు.

The Goat సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత ఇంకో సినిమా ఉండొచ్చు అని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. తాజాగా The Goat సినిమా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో ఇదే విజయ్ లాస్ట్ సినిమానా అని అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విజయ్ తప్ప మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.

Also Read : Trivikram – Naga Vamsi : తెలుగు రాష్ట్రాలకు త్రివిక్రమ్, పవన్ నిర్మాతలు సాయం.. ఎంతంటే..?

ఈ ఈవెంట్లో డైరెక్టర్ వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. ఇది విజయ్ లాస్ట్ సినిమా అవ్వొచ్చు. అందుకే ఈ సినిమా ఫ్యాన్స్ కి ఒక సెలబ్రేషన్ లా ఉండాలి ముందు నుంచి అనుకున్నాము. ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ అందరు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇది విజయ్ గారికి ఒక ఫేర్‌వెల్ సినిమాలా ఉండాలి అనుకున్నాము అని అన్నారు. దీంతో వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. The Goat సినిమానే విజయ్ లాస్ట్ సినిమా అవుతుందా? విజయ్ మళ్ళీ సినిమాలు చేయడా అని విజయ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. మరి నిజంగానే ఇది విజయ్ లాస్ట్ సినిమా అవుతుందా ? తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తాడా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు