The Kerala Story : సల్మాన్ మూవీని దాటేసిన ‘కేరళ స్టోరీ’.. పఠాన్ తరువాతి స్థానంలో..
వివాదాల మధ్య రిలీజ్ అయినా కేరళ స్టోరీ మూవీ.. తాజాగా సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ సినిమాలను దాటేసి షారుఖ్ పఠాన్ తరువాతి స్థానంలో నిలిచింది.
- gum 95921
- Published on- May 17, 2023 / 03:01 PM IST
The Kerala Story collections cross salman khan Ranbir Kapoor movies
Adah Sharma The Kerala Story : ఇటీవల ఎన్నో వివాదాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’. అదా శర్మ (Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా, సోనిలా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళలోని (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే వివాదాస్పద కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో సమస్యలు ఎదురుకుంది. కొన్ని చోట్ల ఈ సినిమాని బ్యాన్ కూడా చేశారు. అయితే ఎన్ని సమస్యలు ఎదరైనా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ సక్సెస్ ని ఎవరు ఆపలేక పోయారు.
మే 5న చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇటీవలే 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం.. తాజాగా 150 కోట్ల మార్క్ ని కూడా దాటేసింది. ఈ మంగళవారం (మే 16) నాటికి ఈ మూవీ ఇండియా వైడ్ 156.69 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. దీంతో ఈ చిత్రం సల్మాన్ ఖాన్ (Salman Khan) కిసీకా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తూ జూతి మైన్ మక్కర్ (Tu Jhoothi Main Makkaar) చిత్రాలను క్రాస్ చేసి షారుఖ్ ఖాన్ పఠాన్ (Pathaan) సినిమా తరువాతి స్థానాల్లో నిలిచింది.
మరి మునుముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. తాజాగా ఈ సినిమా UK లో కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. కేవలం 15 – 20 కోట్ల తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ.. కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ఆడియన్స్ భారీ విజయాన్ని అందిస్తారని తెలియజేసింది.
