NTR 100 Years : 5 లక్షల ప్రైజ్ మనీతో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు.. కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు.. ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ మరణించిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పేరిట ఓ అవార్డుని నెలకొల్పింది. ప్రతి సంవత్సరం నంది అవార్డులు ఇచ్చే సమయంలోనే ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని సినీ రంగంలో విశిష్టమైన సేవలు అందించిన వారికి అందచేస్తూ వచ్చారు.

NTR 100 Years Special why stopped NTR national award
100 Years of NTR : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న ప్రదేశాల్లో ఘనంగా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ, అభిమానులు, తెలుగు దేశం(Telugu Desham) కార్యకర్తలు, నాయకులు గత సంవత్సర కాలంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2023 మే 28న ఎన్టీఆర్ శతజయంతి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి తారకరామారావు గురించి మరోసారి తెలుసుకుంటున్నారు.
ఎన్టీఆర్ మరణించిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పేరిట ఓ అవార్డుని నెలకొల్పింది. ప్రతి సంవత్సరం నంది అవార్డులు ఇచ్చే సమయంలోనే ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని సినీ రంగంలో విశిష్టమైన సేవలు అందించిన వారికి అందచేస్తూ వచ్చారు. నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం 1996లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని స్థాపించారు. ఈ అవార్డుతో పాటు అవార్డు గ్రహీతకు 5 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇచ్చేవారు.
NTR 100 Years : అన్నేసి పాత్రలు.. అంతే కాక డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్.. ఆ సినిమాలకు అన్నీ ఆయనే..
1996 నుంచి 2016 వరకు నిరాటంకంగా ఈ అవార్డుని నంది అవార్డులతో పాటు పలువురు ప్రముఖులకు అందించారు. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఓ రెండేళ్లు ఇచ్చినా, అనంతరం నంది అవార్డులు రెండు ప్రభుత్వాలు కూడా ఇవ్వడం లేదని తెలిసిందే. దీంతో నంది అవార్డులు ఆగిపోవడంతో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా ఆగిపోయింది. గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పెద్దలు నంది అవార్డులు ఇమ్మని రెండు ప్రభుత్వాలను కోరుతున్నా స్పందించడం లేదు. మళ్ళీ నంది అవార్డులు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎప్పుడు మోక్షం వస్తుందో చూడాలి.
ఇప్పటివరకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని అందుకున్న వారు వీళ్ళీ..
1996: అక్కినేని నాగేశ్వర రావు
1997: దిలీప్ కుమార్
1998: శివాజీ గణేశన్
1999: లతా మంగేష్కర్
2000: భానుమతి రామకృష్ణ
2001: హృషీకేశ్ ముఖర్జీ
2002: డాక్టర్ రాజ్ కుమార్
2003: ఘట్టమనేని కృష్ణ
2004: ఇళయరాజా
2005: అంబరీష్
2006: వహీదా రెహమాన్
2007: దాసరి నారాయణ రావు
2008: జమున
2009: బి.సరోజాదేవి
2010: శారద
2011: అమితాబ్ బచ్చన్
2012: S. P. బాల సుబ్రహ్మణ్యం
2013: హేమమాలిని
2014: కమల్ హాసన్
2015: రాఘవేంద్ర రావు
2016: రజినీకాంత్