NTR 100 Years : అన్నేసి పాత్రలు.. అంతే కాక డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్.. ఆ సినిమాలకు అన్నీ ఆయనే..

ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలతో జనాల్ని మెప్పించారు ఎన్టీఆర్. ఒకే సినిమాలో పలు పాత్రలు పోషించి, దర్శకత్వం వహించి కూడా సినిమా హిట్ కొట్టి ప్రేక్షకులని అలరించారు. అలా ఆయన కెరీర్ లో చాలానే సినిమాలు ఉన్నాయి.

NTR 100 Years : అన్నేసి పాత్రలు.. అంతే కాక డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్.. ఆ సినిమాలకు అన్నీ ఆయనే..

NTR 100 Years special NTR working for some movies in multi tasking

NTR 100 Years :  తెలుగువారికి తమకంటూ ఓ గుర్తింపును తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్(NTR). నటుడిగా, రాజకీయనాయకుడిగా ఎన్నో విజయాలు సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగి ఎన్నో రికార్డులను సృష్టించి పేరు, ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించి తనని ఇంతటి వారిని చేసిన ప్రజలకు ఏమైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం(TeluguDesham) పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా గెలిచి తెలుగు ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు.

నందమూరి తారకరామారావు 28 మే 1923లో జన్మించారు. ఈ సంవత్సరంతో ఆయన శత జయంతి పూర్తి చేసుకోనున్నారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గత కొంతకాలంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉంది కావున ఆ మహనీయుని గురించి, ఆయన జీవితంలోని పలు సంఘటనల గురించి మరోసారి తెలుసుకొని స్మరించుకుందాం

 

ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలతో జనాల్ని మెప్పించారు ఎన్టీఆర్. ఒకే సినిమాలో పలు పాత్రలు పోషించి, దర్శకత్వం వహించి కూడా సినిమా హిట్ కొట్టి ప్రేక్షకులని అలరించారు. అలా ఆయన కెరీర్ లో చాలానే సినిమాలు ఉన్నాయి.

1966లో శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో కృష్ణుడు, దుర్యోధనుడిగా రెండు పాత్రలు వ్రేయడమే కాక రచయితగా, నిర్మాతగా కూడా ఆ సినిమాకు పనిచేశారు ఎన్టీఆర్.

1977లో దానవీరశూరకర్ణ సినిమాలో కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా తన నటనతో మెప్పించడమే కాక రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఈ సినిమాకు పనిచేసి భారీ విజయం అందుకున్నారు.

1978లో శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో రాముడు, రావణుడిగా నటిస్తూ రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు.

1979లో శ్రీ మద్విరాట్ పర్వం సినిమాలో కృష్ణ, అర్జున, దుర్యోధన, బృహన్నల, కీచక పాత్రలు వేసి ఒకే సినిమాలో అయిదు పాత్రలతో మెప్పించడమే కాక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు ఎన్టీఆర్.

1984లో వచ్చిన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గౌతమ బుద్ధ, ఆదిశంకరాచార్య, రామానుజ, వేమన పాత్రల్లో మెప్పించడమే కాక స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు.

1991లో రాజకీయాల్లో ఉండి సీఎం అయ్యాక కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో విశ్వామిత్ర, రావణ క్యారెక్టర్స్ లో నటించడమే కాక దర్శకుడిగా, ఎడిటర్ గా కూడా సినిమాకు పనిచేశారు.

1992లో సామ్రాట్ అశోక సినిమాలో అశోకుడు, చాణుక్యుడు పాత్రలు పోషించి దర్శకత్వం వహించి ఎడిటింగ్ కూడా చేశారు.

NTR 100 Years : ఒక్క సీన్ కోసం సెన్సార్ బోర్డు తో గొడవపడి.. మూడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి సినిమాను రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

ఇప్పుడున్న హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా అది కూడా హీరోగా ఒక్క పాత్రలో చేయడానికే చాలా కష్టపడుతున్నారు. కానీ అప్పట్లోనే ఎన్టీఆర్ ఒకే సినిమాలో చాలా పాత్రలు వేస్తూ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా పలు బాధ్యతలు మోస్తూ ఆ సినిమాలకు మంచి విజయాలను కూడా అందించారంటే చాలా గొప్ప విషయం. ఈ విషయంలో ఇప్పటి నటులు ఎన్టీఆర్ ను కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే.