NTR 100 Years : ఒక్క సీన్ కోసం సెన్సార్ బోర్డు తో గొడవపడి.. మూడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి సినిమాను రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలతో జనాల్ని మెప్పించారు ఎన్టీఆర్. ఒకే సినిమాలో పలు పాత్రలు పోషించి, దర్శకత్వం వహించి కూడా సినిమా హిట్ కొట్టి ప్రేక్షకులని మెప్పించారు. అలా ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర'.

NTR 100 Years : ఒక్క సీన్ కోసం సెన్సార్ బోర్డు తో గొడవపడి.. మూడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి సినిమాను రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

NTR 100 Years special Srimadvirat Veerabrahmendra Swami Charitra movie release issue

NTR 100 Years :  మహనీయుడు ఎన్టీఆర్(NTR) తెలుగువారికి తమకంటూ ఓ గుర్తింపును తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. నటుడిగా, రాజకీయనాయకుడిగా ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయం. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగి ఎన్నో రికార్డులను సృష్టించి పేరు, ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించి తనని ఇంతటి వారిని చేసిన ప్రజలకు ఏమైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం(TeluguDesham) పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా గెలిచి తెలుగు ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు.

నందమూరి తారకరామారావు 28 మే 1923లో జన్మించారు. ఈ సంవత్సరంతో ఆయన శత జయంతి పూర్తి చేసుకోనున్నారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గత కొంతకాలంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉంది కావున ఆ మహనీయుని గురించి, ఆయన జీవితంలోని పలు సంఘటనల గురించి మరోసారి తెలుసుకొని స్మరించుకుందాం

ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలతో జనాల్ని మెప్పించారు ఎన్టీఆర్. ఒకే సినిమాలో పలు పాత్రలు పోషించి, దర్శకత్వం వహించి కూడా సినిమా హిట్ కొట్టి ప్రేక్షకులని మెప్పించారు. అలా ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’. 1984లో ఈ సినిమా రిలీజయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గౌతమ బుద్ధ, వేమన, రామానుజ, ఆది శంకరాచార్య, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి.. ఇలా అయిదు పాత్రలు వేసి అలరించారు. అంతే కాకుండా ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత కూడా ఎన్టీఆర్ కావడం విశేషం. సినిమాకు అన్ని తానై నడిపించారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శివుడి వేషం.. నాగుపామే వచ్చి మెడకి చుట్టుకున్న కథ తెలుసా?

అయితే ఈ సినిమా రిలీజ్ వెనక పెద్ద సంఘర్షణే జరిగింది. 1981లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు ఈ సినిమాలోని ఓ సీన్ కి అభ్యంతరం తెలిపి దాన్ని కట్ చేయాలని చెప్పింది. ఇందుకు ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడంతో సెన్సార్ బోర్డు సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లారు. మూడేళ్లు కోర్టులో సినిమాలో ఆ సీన్ ఉండాల్సిందే అని పోరాడి విజయం సాధించారు. దీంతో 1981లో రిలీజవ్వల్సిన సినిమా 1984లో రిలీజయింది. నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతి సంవత్సరం ఈ సినిమా రిలీజయింది.