The Kerala Story : ఇండియాలో 50 కోట్లు కొల్లగొట్టిన ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఏకంగా 37 దేశాల్లో విడుదల..
ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు.
- Saketh U
- Published On : May 11, 2023 / 10:02 AM IST
The Kerala Story movie releasing in 37 countries
The Kerala Story : కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో, రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాము అని చెప్తూ తీసిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). ఈ సినిమా టీజర్ రిలీజ్ నుంచి కూడా సినిమాపై పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించగా సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించారు.
ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు. ది కేరళ స్టోరీ సినిమా మౌత్ టాక్ తో మంచి విజయం సాధించడంతో ఇప్పటికే సినిమా 56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
సినిమాకు మంచి ఆదరణ, కలెక్షన్స్ వస్తుండటంతో చిత్రయూనిట్ మరింతగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ మే 12న ది కేరళ స్టోరీ సినిమాను మరో 37 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంకా ఏయే దేశాల్లో రిలీజ్ చేస్తారనేది ప్రకటించలేదు. అమెరికా, ఆస్ట్రేలియా , బ్రిటన్ తో పాటు పలు దేశాల్లో ది కేరళ స్టోరీ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ దేశాల్లో సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
