The video of Alia Bhatt kissing her baby gone viral..
Alia Bhatt : బాలీవుడ్ లవ్లీ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ ఈ సంవత్సరం ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ అమ్మానాన్నలు కాబోతున్నట్లు ప్రకటించగా.. పెళ్లయిన నెల రోజులకే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేయడంతో ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. నవంబర్ 6న ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్ లో పండంటి పాపకి జన్మనిచ్చినట్లు తెలియజేశారు ఈ స్టార్ కపుల్.
Alia Bhatt : పండంటి పాపకి జన్మనిచ్చిన అలియా భట్.. అంబానీ హాస్పిటల్‌లో డెలివరీ..
గత కొన్ని రోజులుగా రణబీర్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి అలియాకి తోడుగా ఉంటున్నాడు. అలియా కూడా డెలివరీ అయిన తర్వాత సంవత్సరం వరకు కూడా షూటింగ్స్ జోలికి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యిందట. కాగా తమ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన పాపని అలియా ముద్దాడుతూ ఎమోషనల్ అయిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
ఇక వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం “బ్రహ్మాస్త్ర పార్ట్ 1” బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా రెండో భాగం ‘దేవ్’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మూవీకే హైలైట్ అయిన దేవ్ పాత్ర ఎవరు పోషించబోతున్నారు అంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తుంది.
Congratulations ? alia so cute baby girl ❣️❣️❣️???? pic.twitter.com/kpYSt1Qfs4
— Drx.monikachoudhary (@monikac60799851) November 7, 2022