Alia Bhatt : పండంటి పాపకి జన్మనిచ్చిన అలియా భట్.. అంబానీ హాస్పిటల్‌లో డెలివరీ..
తాజాగా అలియా ఇవాళ ఉదయం ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్ లో డెలివరీ కోసం జాయిన్ అయింది. కొద్ది సేపటి క్రితమే అలియా భట్ ఓ పండంటి పాపకి జన్మనిచ్చినట్టు సమాచారం................

Alia Bhatt delivered baby girl
Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సంవత్సరం ఏప్రిల్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. జూన్ లో తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది అలియా. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అలియా సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ లో పాల్గొంది. బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ తర్వాత నుంచి అలియా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. డెలివరీ అయిన తర్వాత సంవత్సరం వరకు కూడా షూటింగ్స్ జోలికి వెళ్ళకూడదు అని అలియా ఫిక్స్ అయింది. ప్రస్తుతం రణబీర్ కూడా సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని అలియాతో తోడుగా ఉంటున్నాడు.
తాజాగా అలియా ఇవాళ ఉదయం ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్ లో డెలివరీ కోసం జాయిన్ అయింది. కొద్ది సేపటి క్రితమే అలియా భట్ ఓ పండంటి పాపకి జన్మనిచ్చినట్టు సమాచారం. అలియా, రణబీర్ ఫ్యామిలీ అంతా హాస్పిటల్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు రణబీర్, అలియా జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Alia Bhatt : హాస్పిటల్‌లో జాయిన్ అయిన అలియా భట్..
అలియా భట్ పాపకి జన్మనిచ్చింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట నెల రోజులకే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేయడం, ఇప్పుడు పెళ్లయిన 7 నెలలకే పాప పుట్టడంతో ఈ న్యూస్ ట్రెండింగ్ లో ఉంది.
Alia Bhatt & Ranbir Kapoor Blessed with Baby Girl. #aliabhatt #RanbirKapoor ❤️ pic.twitter.com/lBnSa7PAah
— Viral Bhayani (@viralbhayani77) November 6, 2022