×
Ad

Nag 100: నాగ్ 100 మూవీపై షాకింగ్ డెసిషన్.. అవేమి ఉండవట.. పాపం ఫ్యాన్స్

కింగ్ నాగార్జున(Nag 100) నటిస్తున్న 100వ సినిమా గురించి టీం ఆసక్తికర డెసిషన్ తీసుకున్నారట.

There is no updates from Nag 100 movie Until the shooting is complete.

  • శరవేగంగా నాగార్జున 100వ సినిమా షూటింగ్
  • అప్డేట్స్ ఇవ్వకూడదని ఫిక్స్ అయిన టీం
  • డిజప్పాయింట్ అవుతున్న నాగ్ ఫ్యాన్స్

Nag 100; టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో 100వ సినిమా చేస్తున్నాడు. చాలా ప్రెస్టీజియస్ తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అసలు ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా షూటింగ్ ని కానిచ్చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న న్యూస్ కూడా ఈ సినిమా గురించి బయటకు రావడం లేదు.

అయితే, నాగ్ 100(Nag 100) సినిమా గురించి మేకర్స్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. అదేంటంటే, ఈ సినిమాను చాలా గోప్యాంగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నారట. అందుకే, పూజ కార్యక్రమాలు కూడా ఎవరికీ తెలియకుండా జరిపించేశారు. అలాగే షూటింగ్ కూడా గోప్యంగానే జరుగుతుంది. ఇక అప్డేట్స్ విషయంలో కూడా అదే మైంటైన్ చేయనున్నారట మేకర్స్. షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు ఎలాంటి న్యూస్, అప్డేట్ బయటకు రాకూడదని ఫిక్స్ అయ్యారట.

Venkatesh: ఫుల్ ఫామ్ లో వెంకటేష్.. రెమ్యునరేషన్ బాగానే పెంచేశాడు.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

ఒకసారి షూటింగ్ కంప్లీట్ చేశాక విడుదల వరకు వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫైనల్ గా సినిమా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. అందుకే, నాగ్ 100కి సంబందించిన ఒక్క న్యూస్ కూడా సోషల్ మీడియాలో రావడం లేదు. అయితే, నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కాస్త డిజప్పాయింట్ గా ఉన్నారట. మిగతా హీరోలందరూ వరుసగా అప్డేట్స్ ఇస్తూ పోతుంటే తమ హీరో సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకూడదు అనుకోవడం కరక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అది కేసుల నాగ 100వ సినిమాకు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఏంటో అని నెట్టింట వైరల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగ్ 100వ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారట మేకర్స్. చూడాలి మరి ఈ డెసిషన్ సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అని.