Poonam Pandey : పూనమ్ పాండే వార్తల్లో నిలిచిన ప్రధాన వివాదాలు ఇవే..

నటి పూనమ్ పాండే తరచూ వివాదాలతో వార్తల్లో ఉండేవారు. సోషల్ మీడియాలో తన పోస్టులతో పెద్ద దుమారమే రేపేవారు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించడం విషాదకరం.

Poonam Pandey : పూనమ్ పాండే వార్తల్లో నిలిచిన ప్రధాన వివాదాలు ఇవే..

Poonam Pandey

Poonam Pandey : బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మరణం అందర్నీ షాక్‌కి గురిచేసింది. తరచూ వివాదాలతో వార్తల్లో ఉండే పూనమ్ సర్వైకల్ క్యాన్సర్‌తో కన్నుమూయడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

Cervical Cancer : సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిన పూనమ్ పాండే.. ఈ క్యాన్సర్ ఎలా సోకుతుందంటే..

‘లాక్ అప్’ రియాల్టీ షోలో చివరిసారిగా కనిపించిన పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశారు. పూనమ్ పాండే మేనేజర్ పరుల్ చావ్లా ఆమె మరణాన్ని ధృవీకరించారు. 32 సంవత్సరాల వయసులో ఎంతో భవిష్యత్ ఉన్న నటి క్యాన్సర్‌తో మరణించడంతో సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూనమ్ పాండే బోల్డ్ షూట్స్, వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు.

2011 లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచారు. అది నిజం కావడంతో ఆమె తన మాట నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీసీఐ అడ్డుకుంది. అప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు. ఆ తర్వాత సంవత్సరం తనకు ఎంతో ఇష్టమైన IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్టు చేసి సంచలనం రేపారు.

Poonam Pandey : బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండే కన్నుమూత

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో పూనమ్ పాండే, ఆమె భర్త నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు రావడంతో పోలీసులు వీరిని అరెస్టు చేసారు. కోవిడ్ సమయంలో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిన వీరిపై విమర్శలు వెల్లువెత్తాయి. 2017 లో పూనమ్ పాండే ‘పాండే యాప్’ ప్రారంభించారు. కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుండి యాప్‌ను నిషేధించింది. 2021 లో పాండే తన భర్తపై గృహహింస కేసు పెట్టారు. దాంతో అతనిని అరెస్టు చేసారు. రియాలిటీ షో ‘లాక్ అప్’ లో పాండే తాను అనుభవించిన గృహ హింసను వెల్లడించారు. చివరికి సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి పోరాడి మరణించినట్లు పూనమ్ పాండే టీమ్ వెల్లడించడం విషాదకరం.