Cervical Cancer : సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిన పూనమ్ పాండే.. ఈ క్యాన్సర్ ఎలా సోకుతుందంటే..

బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిన వార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఈ క్యాన్సర్ ఏంటి? ఎలా సోకుతుంది?

Cervical Cancer : సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిన పూనమ్ పాండే.. ఈ క్యాన్సర్ ఎలా సోకుతుందంటే..

Cervical Cancer

Cervical Cancer : ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించడం విషాదాన్ని పంచింది. అయితే ఈ క్యాన్సర్ ఎలా సోకుతుంది.. ముందుగా ఎలా గుర్తించాలి?

Breast Cancer : యువతులలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ? నిర్ధారణ, చికిత్స

2020 లో ప్రపంచ వ్యాప్తంగా 6,04,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంచనా వేయబడింది. దాదాపు వారిలో 3,42,000 మంది మరణించారట. అంటే మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అసలు ఈ క్యాన్సర్ ఎలా సోకుతుంది? అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ద్వారా ఈ క్యాన్సర్ సోకుతుంది. ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, అతిగా గర్భ నిరోధక మాత్రలు వాడటం, ధూమపానం వంటి అలవాట్లు, చిన్న వయసులో తల్లి అయిన వారిలో ఈ క్యాన్సర్ సోకే అవకాశాలు ఉన్నాయి.

ఈ HPV వైరస్ రోగ నిరోధక వ్యవస్థ అడ్డుకున్నప్పటికీ అసాధారణ కణాల పెరుగుదలకు దారి తీసినపుడు క్యాన్సర్‌కి దారి తీస్తుంది. అసాధారణ కణాలు క్యాన్సర్‌గా మారడానికి కొందరిలో 15 నుండి 20 సంవత్సరాలు పడితే రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్న స్త్రీలలో 5 నుండి 15 సంవత్సరాల లోపు బయటపడవచ్చును. గర్భాశయ క్యాన్సర్‌లో సాధారణంగా పీరియడ్స్ మధ్య, మెనోపాజ్ తర్వాత, లైంగిక సంపర్కం తర్వాత విపరీతమైన రక్తస్రావం అవుతుంది. యోని నుండి దుర్వాసనతో కూడిన స్రవాలు వెలువడతాయి. వెన్ను,కాళ్లు లేదా పొత్తికడుపులో నిరంతరం నొప్పి ఉండవచ్చు. బరువు తగ్గడం, అలసట, ఆకలి లేకపోవడం, యోని అసౌకర్యంగా ఉండటం, కాళ్లలో వాపు వంటి లక్షణాలు కనపడవచ్చు. అయితే పాప్‌స్మిచర్ టెస్టు అంటే ఒక పరికరంతో గర్భాశయ ముఖద్వారం నుండి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. వీటితో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్స్, బయాప్పీ విధానాల ద్వారా కూడా నిర్ధారిస్తారు. రేడియేషన్, కీమోథెరపి వంటి చికిత్సలు ఉంటాయి.

Gastric Cancer : కడుపులో ఇన్ఫెక్షన్ సమస్యలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు దారితీస్తాయా ?

గర్భాశయ క్యాన్సర్ ముందుగా గుర్తించినట్లయితే మొదటి రెండు దశల్లో సరైన చికిత్స ద్వారా నియంత్రించవచ్చును. ఈ క్యాన్సర్ నివారణ చర్యలకు ప్రభుత్వాలు కూడా పాటుపడుతున్నాయి. 2024 మధ్యంతర బడ్జెట్ సమర్పిస్తున్న సందర్భంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు  9 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్న బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.