Breast Cancer : యువతులలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ? నిర్ధారణ, చికిత్స

శిశువులకు తల్లిపాలు ఇవ్వని వారు, పిల్లలు లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత, రేడియేషన్ కు గురి కావటం వంటివి రొమ్ము క్యాన్సర్ రావటానికి కారకాలు. అలాగే వీటితోపాటు నోటి గర్భనిరోధక మాత్రల వాడకం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ఎక్కువగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

Breast Cancer : యువతులలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ? నిర్ధారణ, చికిత్స

breast cancer

Breast Cancer : యువతలో రొమ్ము క్యాన్సర్ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి, అయితే మొదటి విషయం ఏమిటంటే రొమ్ము క్యాన్సర్ పై యువతులలో అవగాహన స్థాయి బాగా పెరిగింది. ఎక్కువ మంది యువతులు ప్రాధామికస్ధాయిలోనే దీనిని గుర్తిస్తున్నారు. దీంతో ఎక్కువ రొమ్ము క్యాన్సర్‌లను ప్రారంభంలోనే గుర్తించటం ద్వారా సకాలంలో చికిత్స పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

READ ALSO : Gastric Cancer : కడుపులో ఇన్ఫెక్షన్ సమస్యలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు దారితీస్తాయా ?

రొమ్ము క్యాన్సర్ కారకాలు ;

జీవనశైలిలో వచ్చిన మార్పులు , నిశ్చల జీవనశైలి, ఆహారంలో మార్పులు, ఎక్కువ కొవ్వు, తక్కువ ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవటం, శారీరక వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి. ఇవి కాకుండా ఇతర కారణాలు రొమ్ము క్యాన్సర్ కు దారి తీస్తున్నాయని గుంటూరు అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ క్యాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ చందన వేమూరి చెబుతున్నారు.

తొలి కాన్పు ఆలస్యం కూడా రొమ్ము క్యాన్సర్ కు కారణాలలో ఒకటి. అంతేకాకుండా శిశువులకు తల్లిపాలు ఇవ్వని వారు, పిల్లలు లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత, రేడియేషన్ కు గురి కావటం వంటివి రొమ్ము క్యాన్సర్ రావటానికి కారకాలు. అలాగే వీటితోపాటు నోటి గర్భనిరోధక మాత్రల వాడకం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ఎక్కువగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది చాలా బలమైన కారకం కాకపోయినా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ రావటానికి జన్యుపరమైన కారకాలు కూడా కారణమని అధ్యయనాల్లో తేలింది.

READ ALSO : Cervical Cancer : గర్భాశయ క్యాన్సర్ ను ముందస్తు వ్యాక్సిన్ తో అరికట్టవచ్చా ?

ఏ వయస్సు వారిలో రొమ్ము క్యాన్సర్ వస్తుంది ?

గతంలో రొమ్ము క్యాన్సర్‌ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. వాస్తవానికి పూర్వం 50 , 60 ఏళ్లు పైబడిన మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవారు. అయితే ప్రస్తుతం 40 ఏళ్లు పైబడిన మహిళలు , అంతకన్నా తక్కువ వయసు కలిగిన యువతులు సైతం రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు.

రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం ;

ఇటీవలి కాలంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మమోగ్రఫీ, బయాప్సీ, వంటి వాటి ద్వారా ప్రమాద కారకాలను ప్రాధామిక దశలోనే గుర్తించవచ్చు. మహిళలు స్క్రీనింగ్ కోసం ముందుకు వస్తే వారిలో ప్రమాదకారకాలను గుర్తించేందుకు వీలు కలుగుతుంది. గతంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అయితే ఇటీవలి కాలంలో అవగాహన పెరగటంతో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిందని డాక్టర్ చందన వేమూరి అంటున్నారు.

READ ALSO : Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే !

రొమ్ముక్యాన్సర్ మాత్రమే కాకుండా గర్భాశయ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, వంటి వాటి విషయంలో అవగాహన కలిగి ఉండటంతోపాటు ప్రాధమిక దశలోనే గుర్తించటం ద్వారా సకాలంలో చికిత్స పొందటం వల్ల ప్రమాదం నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుందని ఆమె సూచిస్తున్నారు. వాటిని నిర్ధారించేందుకు ప్రస్తుతం పాప్ స్మెర్,LBC, HPV పరీక్ష, కోలనోస్కోపీ , జీవాణుపరీక్ష, CT స్కాన్ & PET స్కాన్ వంటి పరీక్షా విధానాలు అందుబాటులో ఉన్నాయి.

చికిత్సలు ;

ప్రస్తుతం అత్యాధునిక మైన చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రేడియో థెరపీ, కిమో థెరపీ, టార్గెటెడ్ థెరపీలతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

READ ALSO : Lung Cancer : పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు ఇవే ?

చివరిగా ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి లేని జీవితం, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామాలు, ఏరోబిక్స్ మొదలైనవాటిని రోజువారి అనుసరించటం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని దూరంగా ఉంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.