Cervical Cancer : గర్భాశయ క్యాన్సర్ ను ముందస్తు వ్యాక్సిన్ తో అరికట్టవచ్చా ?

ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేనేళ్ల లోపు ఆడపిల్లలకు రెండు డోసుల టీకాలను వేయించాలి.

Cervical Cancer : గర్భాశయ క్యాన్సర్ ను ముందస్తు వ్యాక్సిన్ తో  అరికట్టవచ్చా ?

cervical cancer

Cervical Cancer : గర్భాశయ క్యాన్సర్ స్త్రీ గర్భాశయ ముఖద్వారంలో వస్తుంది. గర్భాశయ క్యాన్సర్ కాలక్రమేణా పెరుగుతుంది. సాధారణంగా గర్భాశయంలోని కణాలలో అసాధారణ మార్పులతో ఇది ప్రారంభమౌతుంది. రొమ్ము క్యాన్సర్ తర్వాత ఎక్కువ మంది మహిళలు బాధతున్నది గర్భాశయ క్యాన్సర్​తోనే. గర్భాశయ క్యాన్సర్ అనేది ఏ మహిళకైనా రావచ్చు. 30 ఏళ్లు పైబడిన మహిళల్లో ఇది వస్తుంది.

READ ALSO : sweet potatoes health benefits : వీటిని తింటే క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధులనుండి రక్షణ పొందొచ్చు తెలుసా !

గర్భాశయ క్యాన్సర్ ఎలా వస్తుంది ;

గర్భాశయ క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లో అనే వైరస్ (HPV) వల్ల వస్తుంది. HPV అనేది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులలో ఒకటి. లైంగిక కార్యకలాపాల్లో యాక్టివ్ గా పాల్గొనే మహిళలు HPV బారిన పడే అవకాశాలు ఉంటాయి.

లక్షణాలు ;

1. నెలసరి సమయంలో యోని నుండి అధిక రక్తస్రావం
2. వెజైనల్ డిశ్చార్జి దుర్వాసనతో కూడి ఉండటం
3. లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత తీవ్రమైన నొప్పి
4. మూత్రవిసర్జన చేసే సమయంలో ఇబ్బంది
5.సంభోగం తర్వాత, పీరియడ్స్ మధ్య, పెల్విక్ పరీక్ష తర్వాత రక్తస్రావం
6. కడుపుబ్బరం వేధిస్తున్నా, అలసట, నీరసం, విరేచనాలు.

READ ALSO : Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే !

క్యాన్సర్ ను గుర్తించటం ;

గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించటానికి కొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో పాపానికోలౌ పరీక్ష దీనినే పాప్ టెస్ట్ గా పిలుస్తారు. హై రిస్క్ (HR) HPV పరీక్ష ఇలా రెండు పరీక్షల ద్వారా దానిని గుర్తించవచ్చు. చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లు కూడా తెలియదు.

గర్భాశయ క్యాన్సర్ కు టీకాలు ;

ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేనేళ్ల లోపు ఆడపిల్లలకు రెండు డోసుల టీకాలను వేయించాలి.

READ ALSO : Air Pollution : వాయు కాలుష్యం వల్ల హార్ట్ పేషెంట్, లంగ్ క్యాన్సర్ , బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరంటే?

పదిహేను సంవత్సరాల వయసు దాటిన ఆడపిల్లలు మూడు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు తరవాత రెండు నెలలకు ఒకటి, ఆరునెలలకు మరొకటి చొప్పున మూడు డోసులు తీసుకోవాలి.

సర్వైకల్‌ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ల వయసులోనూ తీసుకోవచ్చు అయితే పెళ్లికి ముందు ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గర్భాశాయ క్యాన్సర్ రాకుండా ఈ టీకాలు అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సిన్‌లను ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిలో పరీక్షించారు. వీటి వల్ల మంచి ఫలితాలే వచ్చినట్లు నిర్ధారణ అయింది. వీటిని తీసుకోవటం వల్ల తేలికపాటి కళ్లు తిరగటం వంటి లక్షణాలు మినహా పెద్దగా ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఏమీ ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.