sweet potatoes health benefits : వీటిని తింటే క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధులనుండి రక్షణ పొందొచ్చు తెలుసా !

స్వీట్ పొటాటోతో రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని తీసుకోవచ్చు. కొంతమంది వీటిని కాల్చుకుని తింటారు. మరి కొందరు ఉడికించి తింటారు. స్మూతిలలో చేర్చుకుంటారు. వాటి సహజమైన తియ్యదనం వంటకాలకు మరించి రుచిని అందిస్తుంది.

sweet potatoes health benefits : వీటిని తింటే క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధులనుండి రక్షణ పొందొచ్చు తెలుసా !

Sweet Potatoes

sweet potatoes health benefits :  చిలగడ దుంప వీటినే స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. ఇది రక్తంలో చక్కెర నియంత్రణ, క్యాన్సర్ నివారణతో సహా అనేక పోషకాహార ప్రయోజనాలను అందిస్తుంది. చూడటానికి బంగాళాదుంపల రూంపలో ఉన్నప్పటికీ తింటే మాత్రం తియ్యగా ఉంటాయి. అందుకే వీటిని స్వీట్ పొటాటో గా పిలుస్తారు. ఈ శక్తివంతమైన దుంపలు రక్తంలో చక్కెర నియంత్రణకు దోహదపడటమే కాకుండా, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయటంలో సహాయపడతాయి. క్యాన్సర్ నివారణలో దోహదపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలతో చిలగడదుంపలు ఆరోగ్యకరమైన అహారంగా దోహదం చేస్తాయి. వివిధ రూపాల్లో చిలగడ దుంపలను ఆహారంగా తీసుకోవచ్చు.

READ ALSO : Sweet Potato : చిలగడదుంపతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు!

చిలగడ దుంపలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

బ్లడ్ షుగర్ నియంత్రణకు:

తియ్యగా ఉండే చిలగడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు అద్భుతమైన ఎంపికగా ఉపయోగపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉండటంతోపాటు, అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు దోహదం చేస్తుంది, రక్తంలో చక్కెరలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. మధుమేహాన్ని , గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించాలనుకునే వారు ఆహారంలో తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

క్యాన్సర్ నివారణకు:

చిలగడదుంపల్లో బీటా-కెరోటిన్ , ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక రకాల ప్రయోజనకరమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధికి దోహదం చేస్తాయి. తియ్యటి బంగాళాదుంపలను ఆహారంలో చేర్చుకోవటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణగా సహాయపడతాయి.

READ ALSO : Sweet Potato Cultivation : ఖరీఫ్ పంటగా చిలగడదుంప సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

పోషకాలు అధికంగా :

చిలగడదుంపల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. డైటరీ ఫైబర్ కు గొప్ప మూలంగా చెప్పవచ్చు. జీర్ణ ఆరోగ్యానికి , కడుపు నిండిన అనుభూతిని కలిగించేందుకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఎ (బీటా-కెరోటిన్ రూపంలో), విటమిన్ సి, అనేక బి విటమిన్లు వంటి విటమిన్లను శరీరానికి అందిస్తుంది. పొటాషియం వంటి ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి.

పేగు ఆరోగ్యానికి ;

చిలగడదుంపలో ఉండే ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చిలగడదుంపలో కరిగే , కరగని రెండు రకాల ఫైబర్ ఉంటుంది. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ ఏ రకమైన ఫైబర్ ను జీర్ణం చెయ్యలేదు. ఫైబర్ జీర్ణవ్యవస్థలోనే ఉండి అనేక రకాల పేగు సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

READ ALSO : Sweet Potato : శీతాకాలంలో చర్మసమస్యలను దరిచేరకుండా చేసి, జీర్ణశక్తిని పెంచే చిలకగడ దుంపలు!

రుచికరమైన వంటకాలు తయారీ :

స్వీట్ పొటాటోతో రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని తీసుకోవచ్చు. కొంతమంది వీటిని కాల్చుకుని తింటారు. మరి కొందరు ఉడికించి తింటారు. స్మూతిలలో చేర్చుకుంటారు. వాటి సహజమైన తియ్యదనం వంటకాలకు మరించి రుచిని అందిస్తుంది. ఆహారప్రియులు చిలగడ దుంపలను ఇష్టంగా తింటారు.

మెదడు పనితీరుకు ;

చిలకడదుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. జంతువులపై జరిపిన కొన్ని అధ్యయనాల్లో చిలగడదుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గించినట్లు స్పష్టమైంది. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

READ ALSO : Sweet Potatoes : బరువు తగ్గటంతోపాటు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే చిలకడ దుంపలు!

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.