Sweet Potato : శీతాకాలంలో చర్మసమస్యలను దరిచేరకుండా చేసి, జీర్ణశక్తిని పెంచే చిలకగడ దుంపలు!

చలికాలంలో మన చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. దీంతో చర్మం పగులుతుంది. దీని వల్ల చర్మం తెల్లగా అవుతుంది. అలాగే మంట, దురద కూడా వస్తాయి. కానీ చిలగడదుంపలను కచ్చితంగా తినాలి.

Sweet Potato : శీతాకాలంలో చర్మసమస్యలను దరిచేరకుండా చేసి, జీర్ణశక్తిని పెంచే చిలకగడ దుంపలు!

Apart from skin problems during winters, beetroot improves digestion!

Sweet Potato : చిలగడదుంపలు శీతాకాలం సీజన్‌లో అధికంగా లభిస్తాయి. చలికాలంలో చిలగడ దుంపలు తినడం వల్ల ఈ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. దీనిలో ఉండే విటమిన్ సి అనేది జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరంచేస్తుంది. దీనిని తినడం వల్ల తక్షణ శక్తి కూడా మీ సొంతం అవుతుంది. చిలగడదుంపలను తినడం వల్ల వీటిల్లో ఉండే ఫైబర్‌, విటమిన్ సి, ఎ వంటి పోషకాలు చర్మంలో తేమ పోకుండా ఉంచుతాయి. దీంతో చర్మం తేమగా ఉంటుంది. మృదువుగా మారుతుంది.

చలికాలంలో మన జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. మలబద్దకం కూడా వస్తుంది. వీటిల్లో ఉండే ఫైబర్ కారణంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. దీని వల్ల మలబద్దకం సమస్య పోతుంది. షుగర్ లెవల్స్ పెరగవు. డయాబెటిస్ ఉన్నవారు సైతం ఈ దుంపలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణ సమస్యలను లేకుండా చేస్తుంది.

చలికాలంలో మన చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. దీంతో చర్మం పగులుతుంది. దీని వల్ల చర్మం తెల్లగా అవుతుంది. అలాగే మంట, దురద కూడా వస్తాయి. కానీ చిలగడదుంపలను కచ్చితంగా తినాలి. చిలగడదుంపలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ దుంపలు మేలు చేస్తాయి. వీటిల్లోని ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

ఇక చిలగడదుంపల్లో బీటా కెరోటీన్‌, విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. కనుక మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో వేడిని పెంచుతాయి. చలికాలంలో మన శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతో చలి నుంచి రక్షణ లభిస్తుంది. చిలగడదుంపలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దుంపలను రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. జుట్టు సమస్యలు దూరం అవుతాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మ సమస్యలు దూరమౌతాయి.