Air Pollution : వాయు కాలుష్యం వల్ల హార్ట్ పేషెంట్, లంగ్ క్యాన్సర్ , బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరంటే?

మెదడులోని ఏదైనా రక్తనాళానికి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు, నరాలు చిట్లిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దేశంలో ఈ వ్యాధి కారణంగా మరణాల రేటు 40 శాతం ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. దీనికి కారణాల్లో వాయుకాలుష్యం కూడా ఒకటి.

Air Pollution : వాయు కాలుష్యం వల్ల హార్ట్ పేషెంట్, లంగ్ క్యాన్సర్ , బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరంటే?

Air Pollution

Air Pollution : శీతాకాలంలోవాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉంటుంది. దేశరాజధాని ఢిల్లీ వంటి నగరాల్లో ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇక దేశంలోని మిగతా ప్రధాన నగరాల్లో కూడా ఈ సమయంలో వాయుకాలుష్యం పెరుగుతుంది. దీపావళి మందులు కాల్చటం , వాహనాల కాలుష్యం , పంటలను తగుల బెట్టటం వంటి వాటి వల్ల వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుంది. ఈ సమయంలో బయటి వాతావరణం కంటే ఇంటి వాతావరణమే సేఫ్ అని చాలా మంది భావిస్తారు.

READ ALSO : Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’.. అంటే ఏంటి?

వాయు కాలుష్యం ఇంటి లోపలికి ప్రవేశించటం వల్ల అటు ఇంట, బయట వాతావరణం పూర్తిగా కాలుష్యంతో కమ్ముకుంటుంది. ఈ పరిస్ధితులు గుండెపోటు ,క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కలిగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చావుకు ఈ కాలుష్య కారకాలే కారణం అవుతున్నాయి. కాలుష్యం కారణంగా గుండె జబ్బులు , బ్రెయిన్ స్ట్రోక్ మరణాలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులతో బాధపడుతున్న రోగులను మంచి వాతావరణంలో ఉంచడం ద్వారా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం.

READ ASLO : Anand Mahindra : వాయు కాలుష్యం అరికట్టడానికి ఆనంద్ మహీంద్ర ఇచ్చిన సూపర్ ఐడియా

ఇంటిలోపల, ఆరుబయట కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు ;

బహిరంగ కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు

గుండె జబ్బులు: వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటే అది గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. మరణాల రేటును 40 శాతం పెంచుతుంది.

స్ట్రోక్: మెదడులోని ఏదైనా రక్తనాళానికి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు, నరాలు చిట్లిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దేశంలో ఈ వ్యాధి కారణంగా మరణాల రేటు 40 శాతం ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. దీనికి కారణాల్లో వాయుకాలుష్యం కూడా ఒకటి.

READ ASLO : Detox Drinks : వాయు కాలుష్యంతో పోరాడటానికి ఉదయాన్నే సేవించాల్సిన డిటాక్స్ డ్రింక్స్ ఇవే !

ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు: వాయు కాలుష్యం కారణంగా చాలా మంది ప్రజలు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. బహిరంగ కాలుష్యం వల్ల కలిగే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)తో 11 శాతం మంది మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్: బహిరంగ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. 6 శాతం మరణాలు ఈ వ్యాధి కారణంగా సంభవిస్తున్నాయి.

పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు: ఆరుబయట గాలి కాలుష్యం వల్ల పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. 3 శాతం మరణాలకు ఇది కారణమవుతుంది.

READ ASLO : Prevent Respiratory Infections : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారా? కాలుష్యంతో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి చిట్కాలు మీకోసం !

మరణానికి దారితీసే వ్యాధులు కలిగించే ఇల్లు, కార్యాలయ కాలుష్యం ;

గుండె జబ్బులు: ఇండోర్ కాలుష్యం గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. 26 శాతం మరణాలు ఇండోర్ కాలుష్యం కారణంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

బ్రెయిన్ స్ట్రోక్: ఇండోర్ కాలుష్యం బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలను దారితీస్తుంది. చివరకు అది మరణానికి కారణమతుంది.

ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు: ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు మరణానికి ప్రధాన కారణం. ఇండోర్ కాలుష్యం వల్ల ఈ మరణాలు సంభవిస్తాయి. మరణాలలో 22 శాతం ఇండోర్ కాలుష్యమే కారణం

READ ASLO : వాయు కాలుష్యం నుండి ఊపిరితిత్తులను రక్షించటంలో సహాయపడే ఆహారాలు ఇవే!

పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు: పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల మరణాలలో 12 శాతం ఇండోర్ కాలుష్యం కారణంగా సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్: ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలలో 6 శాతం ఇండోర్ కాలుష్యం కారణంగా సంభవిస్తున్నాయి.

ఇండోర్ కాలుష్యం ఎలా పెరుగుతుంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల మంది ప్రజలు రోజువారి వంట కోసం కట్టెలు, బొగ్గు పొయ్యిలు, స్టవ్‌లు,బయోమాస్ వంటి వంట విధానాలను అనుసరిస్తున్నారు. ఈ రకమైన ఇంధనం చాలా ప్రమాదకరమైన వాయువులను విడుదల చేసి ఇండోర్ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. గణాంకాల ప్రకారం 2020లో ఇండోర్ కాలుష్యం కారణంగా 3.2 లక్షల మంది చనిపోయినట్లు తేలింది. ఇండోర్ కాలుష్యం పిల్లలు మరియు మహిళల ఆరోగ్యంపై అధిక ప్రభావాన్ని చూపిస్తుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.