Detox Drinks : వాయు కాలుష్యంతో పోరాడటానికి ఉదయాన్నే సేవించాల్సిన డిటాక్స్ డ్రింక్స్ ఇవే !

పసుపు, అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వేడి నీటిలో తాజా పసుపు , అల్లం కలిపి తయారుచేసిన ఈ టీ మన శరీరానికి, మనస్సుకు చాలా ఓదార్పునిస్తుంది. తీపి కోసం తేనెను కూడా వేసుకోవచ్చు.

Detox Drinks : వాయు కాలుష్యంతో పోరాడటానికి ఉదయాన్నే సేవించాల్సిన డిటాక్స్ డ్రింక్స్ ఇవే  !

Warm lemon water

Detox Drinks : చలికాలంలో పెరిగే వాయుకాలుష్యం కారణంగా దగ్గు, జలుబు, ఆస్తమా , ఇతర శ్వాసకోశ సమస్యలతో ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. విషపూరితమైన గాలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కళ్ళు మండటం, గొంతు నొప్పి , నీరసం వంటి సమస్యలు వాయు కాలుష్యం కారణంగా ఉత్పన్నం అవుతాయి. ఇలాంటి వాటి నుండి బయటపడాలంటే ఉదయం నిద్ర లేచిన తరువాత దినచర్యను డిటాక్స్ డ్రింక్స్ తో ప్రారంభించటం మంచిది.

READ ALSO : Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

ప్రతిరోజు గోరువెచ్చని నీరు, హెర్బల్ టీలను సేవించటం వల్ల శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంతోపాటు, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. హైడ్రేటింగ్ ఆహారాలు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారాలు కణాల రక్షణకు శరీరంలోని వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడతాయి. డిటాక్స్ పానీయాలు శరీరం నుండి సహజ పద్దతిలో వాయు కాలుష్యం వంటి పర్యావరణ కారకాలను బయటకు పంపేందుకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండిన మార్నింగ్ డిటాక్స్ డ్రింక్స్ గురించి ఈ కధనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

1. నిమ్మకాయతో గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాయు కాలుష్య ప్రభావాలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు దీనిలో ఉంటాయి. గ్రీన్ టీలోని కాటెచిన్‌లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. ఇవి వాయు కాలుష్య కారకాల వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడుతుంది.

READ ALSO : Benefits of Makhanas : గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణలో మఖానాస్ తో కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు

2. గోరువెచ్చని నిమ్మ నీరు

టాక్సిన్స్ తొలగించడానికి , జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మరియు సమర్థవంతమైన ఎంపిక ఒక గ్లాసు గోరు వెచ్చని నీరులో నిమ్మకాయ రసం. నిమ్మకాయ కాలేయాన్ని ప్రేరేపిస్తుంది. గోరు వెచ్చని నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరం నుండి మలినపదార్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది.

READ ALSO : Poor Dental Health : దంతాల శుభ్రత సరిగా లేకుంటే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ? అధ్యయనం ఏంచెబుతుందంటే ?

3. పసుపు, అల్లం టీ

పసుపు, అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వేడి నీటిలో తాజా పసుపు , అల్లం కలిపి తయారుచేసిన ఈ టీ మన శరీరానికి, మనస్సుకు చాలా ఓదార్పునిస్తుంది. తీపి కోసం తేనెను కూడా వేసుకోవచ్చు. పసుపు, అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి కాలుష్య కారకాలకు గురికావడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను అందిస్తాయి.

READ ALSO : Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్

4. దోసకాయ, పుదీనా నింపిన నీరు

దోసకాయ ,పుదీనా కలిపిన నీరు ఉదయం సమయంలో తీసుకోవటం వల్ల హైడ్రేటింగ్ ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రెండు పదార్థాల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. అయితే పుదీనా జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !

5. కలబంద రసం

ఒక టేబుల్‌స్పూన్ కలబంద రసం, నిమ్మరసం తీసుకుని గ్లాసు నీటిలో కలుపుకోవాలి. ఈ శక్తివంతమైన డిటాక్స్ డ్రింక్ కాలేయానికి మేలు కలిగిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కాలుష్య కారకాల వల్ల కలిగే మంటను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

READ ALSO : Breastfeeding : చంటిబిడ్డలకు పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవటం మంచిదంటే ?

6. బీట్రూట్ , క్యారెట్ రసం

దుంపలు , క్యారెట్‌లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయ పనితీరుకు తోడ్పడతాయి. వాటిని కలిపి జ్యూస్ చేయడం వల్ల రుచికరమైన పానీయం తయారవుతుంది. ఈ జ్యూస్ సెల్యులార్ రక్షణలో కూడా సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

7. చియా సీడ్ డిటాక్స్ డ్రింక్

చియా విత్తనాలను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. చియా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. చియా విత్తనాలు వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, ఆకలిని నియంత్రించడంలో , ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయపడతాయి.