Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

ఇనుము తోపాటు ఈ ముఖ్యమైన విటమిన్ల లోపాలు ఎముకల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. సమతుల్య ఆహారం, అవసరమైన పోషకాలను శరీరానికి అందించటం ఉత్తమం. ఆహారం ద్వారా వీటిని తీసుకోవటం సాధ్యకానప్పుడు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

keeping bones healthy

Keeping Bones Healthy : బలమైన,ఆరోగ్యకరమైన ఎముకల గురించి చెప్పినప్పుడుల్లా మనకు గుర్తుకు వచ్చేది కాల్షియం. అయితే ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతోపాటు మరికొన్ని విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఎముకల గట్టితనానికి కాల్షియం ఒక మూలస్తంభంగా బావించినప్పటికీ ఇతర పోషకాలు సైతం క్రియాశీలిక పాత్ర పోషిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఐరన్ ఎముకల ఆరోగ్యం విషయంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది.

READ ALSO : Banana Chips : రుచిగా ఉన్నాయని అరటికాయ చిప్స్ లాగించేస్తున్నారా? ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్!

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కొన్ని విటమిన్‌ల గురించి నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఐరన్ అనేది ముఖ్యంగా రక్తహీనతను నివారించడంలో ,రక్తంలో సరైన ఆక్సిజన్ సరఫరాను నిర్ధారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. ఐరన్ తోపాటు ఇతర విటమిన్‌లు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ సి కీలక పాత్రధారులుగా చెప్పవచ్చు.

READ ALSO : Cancer Heart Disease Vaccines : క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు!

ఇనుము తోపాటు ఈ ముఖ్యమైన విటమిన్ల లోపాలు ఎముకల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. సమతుల్య ఆహారం, అవసరమైన పోషకాలను శరీరానికి అందించటం ఉత్తమం. ఆహారం ద్వారా వీటిని తీసుకోవటం సాధ్యకానప్పుడు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. సప్లిమెంట్ తీసుకునే ముందు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

READ ALSO : Heart Disease : షుగర్ ఉన్నవారికి గుండె జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే ?

జీవితాంతం ఎముకలు దృఢంగా ఉండేలా చూసుకోవడానికి, ఈ ముఖ్యమైన పోషకాలను ఆహారంలో రోజువారిగా తీసుకోవాలి. వీటికి సంబంధించి ఎలాంటి లోపం కలిగినా, వాటి వల్ల సమస్యలు ఎదురైనా వైద్యులను సంప్రదించి వారు సూచించిన విధంగా ఆహారం, సప్లిమెంట్లను తీసుకోవటం ద్వారా ఎముకల ఆరోగ్యానికి బలమైన పునాదిని నిర్మించుకోవచ్చు.