Prevent Respiratory Infections : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారా? కాలుష్యంతో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి చిట్కాలు మీకోసం !

రన్నింగ్, వాకింగ్, రన్నింగ్ ఏదైనా అవుట్‌డోర్ ఎక్సర్‌సైజ్‌లు చేయటం ఏమాత్రం సరైంది కాదు. ముఖ్యంగా నగరాలలో కాలుష్యం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున బయటి వాతావరణంలో వ్యాయామాలు చేస్తే కాలుష్య కారకాలు పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి.

Prevent Respiratory Infections : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారా? కాలుష్యంతో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి చిట్కాలు మీకోసం !

prevent respiratory infections

Prevent Respiratory Infections : వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీపావళి క్రాకర్లు పేల్చటం కారణంగా రానున్నరోజుల్లో నగరాల్లో గాలి నాణ్యత అధ్వాన్నంగా మారుతుంది. శీతాకాలం సమయం అధికంగా ఉండే వాయుకాలుష్యం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. కాలుష్యం కారణంగా శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్లు ప్రభావితం చేస్తాయి. కాలుష్యంలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి బయటపడేందుకు ఆరోగ్య నిపుణులు కొన్నిసూచనలు చేస్తున్నారు.

READ ALSO : Eating Eggs : డయాబెటిక్ రోగులు గుడ్లు ఆహారంగా తీసుకోవటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయన్న విషయంలో వాస్తవమెంత?

బయటకు వెళ్ళి ఇంటికి తిరిగివచ్చాక చేతులు, ముఖం కడుక్కోవటం ;

అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించడానికి బయటి నుండి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బయటి నుండి అనేక రకాల సూక్ష్మక్రిములను ఇంటికి తీసుకువచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించటం ఉత్తమం.

గోరువెచ్చని నీటిని తాగటం ;

చలికాలంలో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జలుబు, ఫ్లూ నుండి రక్షించుకోవచ్చు. గొంతులోని ధూళి కణాలను తొలగించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి, జలుబు, దగ్గు దరిచేరకుండా చూసుకునేందుకు గోరు వెచ్చని నీరు సహాయపడుతంది.

READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

మాస్క్‌లు ధరించటం ;

ఇంటి నుండి బయటికి బయలుదేరిన సందర్భంలో, రోడ్లపై ప్రయాణించేటప్పుడు మాస్క్ ధరించటం తప్పనిసరి. గాలి నాణ్యత రోజురోజుకు తగ్గుతున్న నేపధ్యంలో మాస్క్ ధరించడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు ఏదైనా కాలుష్యం నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.

అల్లం,నిమ్మకాయ టీ ;

ఉదయాన్నే నిమ్మకాయ,అల్లం టీ తాగడం వల్ల శ్వాసకోశ అవయవాలలోని సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది. శరీరాన్ని ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్ ఆపడమే కాకుండా శరీరానికి పోషకాలను అందిస్తుంది.

READ ALSO : Thyroid Problems : థైరాయడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

చలికాలంలో ఆరుబయట వ్యాయామం చేయవద్దు ;

రన్నింగ్, వాకింగ్, రన్నింగ్ ఏదైనా అవుట్‌డోర్ ఎక్సర్‌సైజ్‌లు చేయటం ఏమాత్రం సరైంది కాదు. ముఖ్యంగా నగరాలలో కాలుష్యం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున బయటి వాతావరణంలో వ్యాయామాలు చేస్తే కాలుష్య కారకాలు పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి.

ఇంటిలోపల గాలిని శుద్ధి చేసే మొక్కలను నాటటం ;

ఇంటి లోపల, ప్రాంగణం చుట్టూ ఇండోర్ గాలిని శుద్ధి చేసే మొక్కలను పెంచుకోవాలి. స్నేక్ ప్లాంట్, డెవిల్స్ ఐవీ, వెదురు పామ్ అనేక ఇతర రకాల మొక్కలను ఎంపిక చేసుకోవాలి.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

వేడి ఆవిరి పట్టటం ;

శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే మాత్రం ఆవిరి పట్టడానికి ప్రయత్నించండి. వ్యాయు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నవారు రోజువారిగా ఆవిరి పట్టటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.