Eating Eggs : డయాబెటిక్ రోగులు గుడ్లు ఆహారంగా తీసుకోవటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయన్న విషయంలో వాస్తవమెంత?

గుడ్లలో విటమిన్ ఎ, బి6, బి12 మరియు సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. గుడ్లలో లూటీన్ మరియు జియాక్సంతిన్ అనే మంచి పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Eating Eggs : డయాబెటిక్ రోగులు గుడ్లు ఆహారంగా తీసుకోవటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయన్న విషయంలో వాస్తవమెంత?

eating eggs

Eating Eggs : గుడ్డు పోషక విలువలు కలిగిన ఆహారం. ఆరోగ్యానికి దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో కోలిన్ , లుటిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.ఇవి అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. మనస్సును ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్డు పచ్చసొన లోబయోటిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు ,గోర్లు అలాగే ఇన్సులిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేసే కొవ్వులు.

READ ALSO : Cultivation of Palm Oil : ప్రకృతి విధానంలో పామాయిల్ సాగు.. తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి

మధుమేహం, గుండె రోగులకు గుడ్లు తినటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీనిలో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే గుడ్లలో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచదు. గుండె జబ్బులు కలిగినవారు వైద్యుల సూచలను, సలహా మేరకు గుడ్డును ఆహారంగా తీసుకోవటం మంచిది.

READ ALSO : Tiger Nuts : డయాబెటిస్ నియంత్రణలో ఉంచే టైగర్ నట్స్ !

డయాబెటిక్ రోగులకు గుడ్లు తినవటం వల్ల ప్రయోజనాలు ;

డయాబెటిక్ రోగులు పరిమితంగా గుడ్లు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పరిశోధనల ప్రకారం, గుడ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్‌లో, గుడ్లు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. ఎవరికైనా అధిక రక్తంలో చక్కెర సమస్య ఉంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మధుమేహం, అధిక బరువు కలిగిన వారు గుడ్లను తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం శ్రేయస్కరం.

READ ALSO : Health Benefits Of Jamun : డయాబెటిస్‌ఉన్నవారు నేరేడు పండ్లు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !

గుడ్లలో విటమిన్ ఎ, బి6, బి12 మరియు సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. గుడ్లలో లూటీన్ మరియు జియాక్సంతిన్ అనే మంచి పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. డయాబెటిక్ రోగులు త్వరగా అలసిపోతారు కాబట్టి ఈ సమస్యనుండి బయటపడాలంటే గుడ్లను తీసుకోవటం ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్, థయామిన్, రిబోఫ్లావిన్, ఫోలేట్, విటమిన్లు B6 మరియు B12 పుష్కలంగా ఉన్నాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

READ ALSO : Prediabetes : యువతలో ప్రీడయాబెటిస్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందా? సర్వేలు ఏంచెబుతున్నాయ్

డయాబెటిక్ రోగులు రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?

మధుమేహం ఉన్నవారు వారానికి మూడు సార్లు గుడ్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కోడిగుడ్డులోని తెల్లసొనను మాత్రమే తీసుకోవాలి. గుడ్లను అయిల్స్ లో ఫ్రైగా చేసుకుని తినటం హానికరం. ఉడికించిన గుడ్లు తినటం ఆరోగ్యానికి మంచిది. మధుమేహంతో పాటు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, అప్పుడు రోజుకు ఒక గుడ్డు మాత్రమే తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాలలో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.