Cultivation of Palm Oil : ప్రకృతి విధానంలో పామాయిల్ సాగు.. తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి
ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో.. పశ్చిమగోదావరి జిల్లా, కోయలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామానికి చెందిన రైతు పాదం రాము పామాయిల్ సాగును చేపట్టాడు.

Palm Oil Cultivation
Cultivation of Palm Oil : తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో నాణ్యమైన పంట దిగుబడి పొందే పంట ఆయిల్ పామ్ . నాటిన 4 వ సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు ఈ తోటల నుండి ఆదాయం పొందే వీలుండటమే కాకుండా మధ్య దళారుల బెడద లేకపోవడంతో స్థిరమైన ఆదాయన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటసాగు విస్తీర్ణం పెరుగుతోంది . పశ్చిమగోదావరి జిల్లాలో ఓ రైతు ప్రకృతి వ్యవసాయంలో ఈ పంటను సాగుచేసి నికరమైన ఆదాయాన్ని పొందుతున్నాడు . మరి ఆ వివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
READ ALSO : Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్
పామాయిల్ ప్రపంచంలో కెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో ఏ ఏటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో.. పశ్చిమగోదావరి జిల్లా, కోయలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామానికి చెందిన రైతు పాదం రాము పామాయిల్ సాగును చేపట్టాడు. రసాయన ఎరువుల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయంలో సాగుచేస్తూ.. నాణ్యమైన అధిక దిగుబడులను సాధిస్తున్నాడు.
READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట
రైతు రాము పామాయిల్ తోటను 10 సంవత్సరాల క్రితం ఉద్యాన శాఖ ప్రొత్సాహంతో తనకున్న 3 ఎకరాల్లో పామాయిల్ మొక్కలను నాటాడు. పాలేకర్ స్ఫూర్తితో కేవలం ప్రకృతి విధానంలోనే సాగుచేస్తున్నాడు. కేవలం పశువుల ఎరువును మాత్రమే మొక్కలకు అందిస్తున్నాడు. పామాయిల్ నుండి కత్తిరించిన కొమ్మలను తోటలోనే మల్చింగ్ వాడుతున్నారు. అంతే కాదు మొదటి రెండు మూడేళ్లు అంతర పంటలను సాగుచేసి అదనపు ఆదాయం పొందుతున్నారు.
READ ALSO : CM Ashok Gehlot : ఆవు పేడ కొంటాం, ఇచ్చిన హామీలు అమలు చేస్తాం : సీఎం ప్రకటన
రసాయన ఎరువులతో సాగుచేస్తే దిగుబడులు వచ్చినా, పురుగు మందులు, ఎరువుల పెట్టుబడికే అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది . కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ పెట్టుబడులు పూర్తిగా తగ్గించుకొని , నాణ్యమైన దిగుబడులను పొందుతూ, అధిక లాభాలను ఆర్జిస్తున్న ఈ రైతు ను చూసి ఇతర రైతులు కూడా ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .