Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్

ఒక వైపు తన వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట.

Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్

integrated farming

Integrated Farming : ఆయనో చార్టెడ్ అకౌంటెంట్ . నెలవారీ సంపాదన లక్షల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో వెలితి . వ్యవసాయంపై ఉన్న మక్కువ… రైతుగా మార్చింది. ఇంకేముంది.. వారానికి ఒకసారి పొలంబాట పడుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక, సాంకేతికతను జోడించి, సమీకృత వ్యవసాయం చేపట్టాడు. ఏడాది పొడవునా పలు పంటలు, అనుబంధ రంగాల నుండి దిగుబడులు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆయన సాగుచేస్తున్న పంటలు ఏంటీ.. ఈ వ్యవసాయ క్షేత్రం ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

READ ALSO : Lokesh Nara: పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై నారా లోకేశ్ ఫైర్.. అర్థరాత్రి ఏం జరిగిందంటే?

వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు.. మూస పద్దతి అంతకన్నా కాదు.. తీరొక్క పంటల మేళవింపు.. ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే,  అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు.  ఒకప్పుడు  రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతే కాకుండా ఒకే పంటను సాగుచేస్తూ నష్టపోతున్నారు.

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు.  మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం  అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు , వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడుతాయి. ఇది గమనించిన నాగర్ కర్నూలు జిల్లా, వెల్డండ మండలం, బొమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన రైతు కలిమిచర్ల విజయ్ సమీకృత వ్యవసాయం చేస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

READ ALSO : Chandrababu Naidu Arrest: ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించిన చంద్రబాబు నాయుడు

విజయ్ స్వతహాగా చార్టడ్ అకౌంటెంట్. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఈయనకు పంటల సాగంటే మక్కువ. ఒక వైపు తన వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట. ఈ రైతు అదేచేశారు. తనకున్న 4 ఎకరాల్లో..  2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తూనే.. మరో 2 ఎకరాల్లో దీర్థకాలిక కలప పంట అయిన శ్రీగంధంతోపాటు దాదాపు 40 రకాల పండ్ల మొక్కలను నాటారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుండి రెండో పంట దిగుబడులను తీస్తున్నారు.

రైతు విజయ్ శీగంధంలో అంతర పంటలుగా సీతాఫలం, జామతో పాటు అనేక రకాల పండ్ల మొక్కలను నాటారు. వీటన్నీటికి నీటిని అందించేదుకు ఉద్యానశాఖ సహకారంతో  పెద్ద ఫాం పాండ్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ పాంలో చేపపిల్లను పెంచుతున్నారు. భవిష్యత్తులో మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. తన వ్యవసాయ క్షేత్రం నుండి నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరిస్తూ… ముందుకు సాగుతున్నారు .

READ ALSO : Chandrababu Arrest : ఏసీబీ కోర్టులో 28పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. సంచలన విషయాలు వెల్లడి.. అందులో ఏముందంటే?

ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గమని గ్రహించాల్సిన అవసరం ఎంతైన ఉంది.