Chandrababu Arrest : ఏసీబీ కోర్టులో 28పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. సంచలన విషయాలు వెల్లడి.. అందులో ఏముందంటే?

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కుట్రకు సూత్రధారి చంద్రబాబేనని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

Chandrababu Arrest : ఏసీబీ కోర్టులో 28పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. సంచలన విషయాలు వెల్లడి.. అందులో ఏముందంటే?

Chandrababu Naidu

Skill Development Case: టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారు జామున నంద్యాల జిల్లాలో అరెస్టు చేసిన పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య శనివారం సాయంత్రం అమరావతి పరిధిలోని సిట్ కార్యాలయంకు చంద్రబాబును రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక కాన్వాయ్ లో తరలించారు. రాత్రంతా విచారణ కొనసాగింది. అరెస్టు చేసి 24గంటలు ముగిసే సమయంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఏసీబీ కోర్టుకు 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును సీఐడీ అధికారులు అందించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టులో సమర్పించారు.

Chandrababu Naidu Arrest: కుట్రకు సూత్రధారి చంద్రబాబే.. ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ అధికారులు.. Live Update

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కుట్రకు సూత్రధారి చంద్రబాబేనని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, 2021 డిసెంబర్ 9కంటే ముందు నేరం జరిగిందని, తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం రూ. 371 కోట్ల కుంభకోణమని అభియోగం మోపారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అరెస్ట్.. అర్ధరాత్రి హైడ్రామా.. విజయవాడకు వెళ్లెందుకు అనుమతిచ్చిన పోలీసులు

సీమెన్స్ 90శాతం ఖర్చు భరిస్తుందని క్యాబినెట్‌లో అబద్ధాలు చెప్పారని, నోట్ ఫైల్‌ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు అప్రూవల్ చేశారని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థికశాఖ కార్యదర్శి అభ్యంతరాలను పట్టించుకోలేదని, అప్పటి సీఎం, సీఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యాయని, షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ. 259 కోట్లు మళ్లించారని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి మార్కెట్ సర్వే జరగలేదని పేర్కొన్నారు.

జీవో నెం.4ను అతిక్రమించి చంద్రబాబు కుట్రలో భాగం అయ్యారని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం రిపోర్టులో లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. సీమెన్స్ సహా ఇతర కంపెనీల ప్రతినిధులు ఇల్లందుల రమేశ్ ద్వారా కలిసిన తర్వాత ఈ ఒప్పందం జరిగిందన్నారు. బాబు, అచ్చెన్నాయుడు కలిసి స్కాం చేశారన్న సీఐడీ.. వివిధ కంపెనీల నుంచి డబ్బు కిలారు రాజేశ్ ద్వారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, పీఏ శ్రీనివాస్‌కు చేరిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.