PNB KYC Dead Line : బిగ్ అలర్ట్.. నవంబర్ 30 డెడ్‌లైన్.. UPS టు NPS, లైఫ్ సర్టిఫికేట్, PNB KYC కోసం అర్జెంట్‌గా ఇలా చేయండి.. లేదంటే..!
PNB KYC Dead Line : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఇప్పటివరకూ మీ కేవైసీని అప్‌డేట్ చేయలేదా? గడువు తేదీ నవంబర్ 30, 2025 దగ్గర పడుతోంది.
PNB KYC Dead Line
PNB KYC Dead Line : బ్యాంకు కస్టమర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. గడువు తేదీ (నవంబర్ 30, 2025) దగ్గర పడుతోంది. ఈ తేదీలోగా పెన్షన్ స్కీమ్, లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేయండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లందరూ నవంబర్ 30 లోపు తమ కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలి.
NPS నుంచి UPSకి మారాలనుకునే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇదే తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఇంకా, పెన్షనర్లు, లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించేందుకు కూడా ఇదే చివరి తేదీ. అందుకే కస్టమర్లందరూ తమ కేవైసీని తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పీఎన్‌బీ కేవైసీ అప్‌డేట్ డెడ్‌లైన్ ఇదే :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్ల కోసం కేవైసీ అప్‌డేట్ డెడ్‌లైన్ నవంబర్ 30, 2025 వరకు పొడిగించింది. అయితే, సెప్టెంబర్ 2025 నాటికి KYC రెన్యువల్ గడువు ఉన్న అన్ని అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. కేవైసీ సకాలంలో పూర్తి కాకపోతే, బ్యాంక్ మీ అకౌంటుపై లిమిట్స్ విధించవచ్చు. అలాగే లావాదేవీలను నిలిపివేయొచ్చు. మీ కేవైసీని అప్‌డేట్ చేసేందుకు అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి.
PNB ONE యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రిజిస్టర్డ్ ఇమెయిల్, పోస్ట్, WhatsApp, SMS, ఏదైనా PNB బ్రాంచ్‌ను విజిట్ చేయడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సరైన సమయంలో కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయడం ద్వారా మీ ఐడెంటిటీతో పాటు మీ అకౌంట్ దుర్వినియోగం కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు చేసే లావాదేవీలన్నీ కూడా సేఫ్‌గా ఉంటాయి.
NPS నుంచి UPSకి మారేందుకు డెడ్‌లైన్ :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు NPS నుంచి UPS (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్)కు మారేందుకు నవంబర్ 30 చివరి తేదీ కాగా, ఉద్యోగులు ఎక్కువ సమయం కోరడంతో కేంద్రం ఇప్పటికే ఈ తేదీని రెండుసార్లు పొడిగించింది. మొదటగా జూన్ 30 వరకు గడువు తేదీని పొడిగించగా ఆ తరువాత సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
యూపీఎస్ (UPS)లో ఇటీవలి మార్పులు చాలా మంది ఉద్యోగులకు అద్భుతమైన పన్ను ప్రయోజనాలను అందిస్తున్నాయి. అందుకే వారంతా తమ ఆప్షన్లను అర్థం చేసుకునేందుకు ఎక్కువ సమయం కోరారు. ఇది వారికి చివరి అవకాశం కావచ్చునని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి యూపీఎస్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగులు వెంటనే అప్లయ్ చేసుకోవడం బెటర్. లేదంటే వచ్చిన అవకాశాన్ని కోల్పోతారు.
పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ డెడ్‌లైన్ :
అందరు పెన్షనర్లకు, లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్లను సమర్పించడానికి నవంబర్ 30 డెడ్‌లైన్. ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి ఈజీ మెథడ్స్ ద్వారా సబ్మిట్ చేయాలని సూచిస్తున్నాయి.
ఆన్‌లైన్ సబ్మిషన్, డోర్ స్టెప్ బ్యాంకింగ్, జీవన్ ప్రమాణ్ యాప్ లేదా బయోమెట్రిక్స్ ద్వారా పూర్తి చేయవచ్చు. పెన్షనర్లు తమ లైఫ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ సకాలంలో సమర్పించకపోతే వారి పెన్షన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది. కానీ, సమర్పించిన తర్వాత లైఫ్ సర్టిఫికేట్ రెన్యువల్ అవుతుంది. మొత్తం పెన్షన్ కూడా తిరిగి పొందవచ్చు.
