Car Insurance : కొత్త కారు కొంటున్నారా? ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ 6 విషయాలను తప్పక గుర్తుంచుకోండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

Car Insurance : మీ పాలసీ ప్రీమియం మీ కారు ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ (IDV)పై ఆధారపడి ఉంటుంది. కారు ప్రస్తుత మార్కెట్ వాల్యూ, మెరుగైన కవరేజ్ కోసం హై ఐడీవీని ఎంచుకోండి.

Car Insurance : కొత్త కారు కొంటున్నారా? ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ 6 విషయాలను తప్పక గుర్తుంచుకోండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

Car Insurance

Updated On : November 24, 2025 / 8:01 PM IST

Car Insurance : కొత్త కారు కొంటున్నారా? అయితే, వెంటనే కారు ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి. భారతీయ మార్కెట్లో కొత్త కారు కొనుగోలుతో పాటు ఇన్సూరెన్స్ కూడా చట్టపరంగా తీసుకోవడం అవసరం. మీ వాహనానికి ఏదైనా నష్టం జరిగినప్పుడు లేదా మీకు లేదా ఇతరులకు గాయం అయినప్పుడు భారీ మొత్తంలో ఆర్థిక నష్టం నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు మొదటిసారి కారు కొనుగోలుదారులైతే బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోండి.

కారు ఇన్సూరెన్స్ 2 రకాలుగా (Car Insurance) పొందవచ్చు. అందులో ఒకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రెండోది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ : చట్టపరమైన ఈ బెనిఫిట్ పొందవచ్చు. థర్డ్ పార్టీ అసెట్‌కు జరిగిన నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.
కాంప్రహెన్సివ్ : థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌తో పాటు మీ సొంత కారుకు కలిగే నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. పూర్తిగా ప్రొటెక్ట్ చేసేందుకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతైనా మంచిది.

అవసరాలకు తగినట్టుగా :
కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేవారు కొన్ని రిక్వైర్‌మెంట్స్ విషయంలో తప్పక అవగాహన కలిగి ఉండాలి. మీ పాలసీ ప్రీమియం అనేది మీ కారు ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ (IDV)పై ఆధారపడి ఉంటుంది. మీ కారు ప్రస్తుత మార్కెట్ వాల్యూ, మెరుగైన కవరేజ్ కోసం (High IDV)ని ఎంచుకోండి. అలాగే, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ, జీరో డిప్రిషియేషన్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ వంటి యాడ్-ఆన్ కవరేజీని పొందవచ్చు.

Read Also : Top Brand Smart TVs : కొంటే ఇలాంటి టీవీలు కొనాల్సిందే.. 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు.. సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

పాలసీలతో కంపేర్ చేయండి : 
ప్రస్తుత ఆటోమొబైల్ మార్కెట్లో అనేక కార్ల ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవచ్చు. వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ప్రీమియంలు, ఫీచర్లు, యాడ్-ఆన్ కవర్లను ఒకటికి రెండు సార్లు కంపేర్ చేసి తీసుకోవడం బెటర్.

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చెకింగ్ :
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఒక బీమా కంపెనీ మొత్తం క్లెయిమ్‌లను పరిష్కరించిన శాతాన్ని సూచిస్తుంది. పాలసీని కొనుగోలు చేసే ముందు మీరు పరిశీలిస్తున్న బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను చెక్ చేయండి. హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మీ క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించేలా ఇన్సూరెన్స్ కంపెనీని సూచిస్తుంది.

కవర్ కానివి ఏంటి? :
అన్ని కార్ల ఇన్సూరెన్స్ పాలసీలు కొన్ని విషయాలకు సంబంధించి కవరేజీ అందించవు. ఈ కవరేజీలు కంపెనీ నుంచి కంపెనీకి మారవచ్చు. ఏది కవర్ అవుతుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా పాలసీ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. సాధారణంగా, మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంతో వాహనం నడపడం వల్ల కలిగే నష్టం, యుద్ధం లేదా అణు ప్రమాదాలు కవర్ చేయవు. క్లెయిమ్ సమయంలో ఏవైనా సమస్యలను నివారించేందుకు ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి.