Vijayasai Reddy: నో పాలిటిక్స్ అంటూనే విజయసాయి ట్విస్టులు.. జగన్‌ను మిస్ అవుతున్నారా? రాజకీయాలకు దూరంగా ఉండలేకపోతున్నారా?
గతంలో ఆ పార్టీలో నెంబర్.2గా పనిచేశారు. తెరవెనుక రాజకీయాలు చక్కబెట్టడంలో జగన్‌కు సాయిరెడ్డి బ్యాక్ బోన్ లాంటి వాడని చెప్తుంటారు.
Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై..ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పి ఏడాది కాకముందే ఎప్పుడూ ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇస్తూ..ఆసక్తికర ట్వీట్స్ చేస్తూ పొలిటికల్ హాట్ టాపిక్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడేమో ఏ పార్టీలో చేరే ఆలోచన లేదంటారు. మరోసారి అవసరమైతే కొత్త పార్టీ పెడతా అంటారు. తన అవసరం ఉందనుకుంటే రాజకీయాల్లోకి వస్తానంటారు.
పవన్ ని పావలా అన్న విషయం మర్చిపోయారా?
అసలు ఈ పొంతన లేని స్టేట్‌మెంట్స్ ఎందుకన్న చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఎప్పటిలాగే..జగన్ కోటరీ అంటూ డైలాగులు పేల్చారు. పవన్‌ను పొగిడేందుకు ప్రయత్నించారు. తనకు ఆయనతో 20 ఏళ్ల స్నేహం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయనను తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని.. భవిష్యత్‌లో కూడా అననని చెప్పారు. కానీ గతంలో పవన్‌ను పావలా అని.. విమర్శించిన విషయాన్ని ఆయన మార్చిపోయారంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయ్.
జగన్‌కు బ్యాక్ బోన్ లాంటి వాడు..!
ఎప్పటికప్పుడు సమ్‌థింగ్ డిఫరెంట్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు విజయసాయిరెడ్డి. మొన్నటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా..పబ్లిక్ వాయిస్‌గా ట్వీట్స్ చేస్తూ చర్చకు దారితీశారు. ఇప్పుడేమో తన అవసరమైతే మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తానంటున్నారు. ఆయన అవసరం పబ్లిక్‌కు ఉందా? లేక ఆయనకే రాజకీయాలు తప్పనిసరిగా మారాయా అన్నది ఇక్కడ పాయింట్. విజయసాయిరెడ్డి అవసరం వైసీపీకి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ఆ పార్టీలో నెంబర్.2గా పనిచేశారు. తెరవెనుక రాజకీయాలు చక్కబెట్టడంలో జగన్‌కు సాయిరెడ్డి బ్యాక్ బోన్ లాంటి వాడని చెప్తుంటారు. అలాంటి విజయసాయిరెడ్డి వైసీపీని వీడినప్పటి నుంచి జగన్ కోటరీని టార్గెట్ చేస్తున్నారు.
కోటరీ వల్లే తాను జగన్‌కు దూరమయ్యాను..జగన్‌ను మిస్ అవుతున్నాను అన్నట్లుగా మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి. తన విషయంలో జగన్ కోటరీ ఆయనను పూర్తిగా డైవర్ట్ చేస్తోందని..అలాంటి వారి మాటలు వినరాదని, అన్నీ ఆలోచించాలని జగన్‌కు సూచించారు. అంటే జగన్ మంచిని కోరుకుంటున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ మాత్రమే కాదు..మాజీ వైసీపీ నేత, జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆయన ఏం మాట్లాడినా పొలిటికల్ యాంగిల్ వెతకడం, దాన్ని హైలెట్ చేయడం కామన్. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్‌గా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. సాయిరెడ్డి మనసు వైసీపీ వైపు లాగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక ఫైన్ మార్నింగ్ విజయసాయిరెడ్డి వైసీపీలో చేరిక ప్రకటన రావొచ్చన్న ఊహాగానాలు ఉండే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు కావొస్తోంది. వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూ వస్తున్నారు. పార్టీకి దూరమైన నేతలను దగ్గర చేసే ప్రయత్నాల్లో పడ్డారు.
విజయసాయి తిరిగి వైసీపీ గూటికి?
మొన్నా మధ్య పార్టీని విడిచి వెళ్లిపోయిన నేతలు తిరిగి పార్టీలోకి రావొచ్చు..నో అబ్జక్షన్స్ అంటూ వైసీపీ ఇంటర్నల్ మీటింగ్‌లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు జగన్. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరతారని పెద్దఎత్తున ప్రచారం కూడా నడిచింది. అయితే జగన్ నుంచే పిలుపు రావాలని విజయసాయిరెడ్డి ఎదురుచూస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ..వ్యవసాయం చేసుకుంటానని చెప్పి..విజయసాయిరెడ్డి తరచూ రాజకీయాలు..పొలిటికల్ రీఎంట్రీపై మాట్లాడుతుండటం మాత్రం ఆయనలో ఉన్న పొలిటికల్ ఇంట్రెస్ట్‌ను స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.
Also Read: మూడేళ్లల్లో 17 లక్షల ఇళ్లు..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
