Prediabetes : యువతలో ప్రీడయాబెటిస్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందా? సర్వేలు ఏంచెబుతున్నాయ్

డయాబెటిస్ వ్యాధి సాధారణంగా యువతలో ఉండదని చాలా మంది అపోహపడుతుంటారు. గత దశాబ్దంలో పిల్లలు, కౌమారదశలు, యువకులలో డయాబెటిస్ బారినపడుతున్న వైనం ఆందోళనకరంగా ఉంది..

Prediabetes : యువతలో ప్రీడయాబెటిస్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందా? సర్వేలు ఏంచెబుతున్నాయ్

prediabetes

Prediabetes : నేషనల్ అర్బన్ డయాబెటిస్ సర్వే ఒక భయంకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. భారతీయ జనాభాలో 14% మందికి ప్రీడయాబెటిస్ ఉందని ఈ సర్వేలో తేలింది. ప్రపంచం మొత్తంలో 88 మిలియన్ల ప్రీ-డయాబెటిక్ రోగులు ఉండగా వారిలో 77 మిలియన్లు భారతదేశానికి చెందినవారేనని ప్రకటించింది. ప్రీ-డయాబెటిస్ అనేది ఆగ్నేయాసియా ప్రాంతంలో 8.9% అంటువ్యాధి రేటుతో అత్యంత ప్రబలంగా ఉన్న వ్యాధిగా గుర్తించబడింది.

ప్రీడయాబెటిస్ ఉన్న రోగులు ఇతరులకన్నా అకాల అనారోగ్యానికి గురయ్యే అవకాశం అధికంగా ఉంది. భారతదేశంలోని మరణాలలో దాదాపు 2% ప్రీడయాబెటిస్ కారణంగా సంభవిస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది.

నెఫ్రోప్లస్‌తో సంబంధం ఉన్న ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అయిన డాక్టర్ చందన్ చౌదరి, ప్రీడయాబెటిస్ అనేది అధిక రక్తంలో చక్కెర స్థాయిని కలిగి ఉండే మధుమేహం యొక్క ప్రాథమిక స్థితిగా పేర్కొన్నారు. సాధారణం కంటే ఎక్కువ, కానీ టైప్ 2 డయాబెటిస్‌గా పరిగణించబడనంత తక్కువ. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను స్రవిస్తుంది, ఇది అన్ని శరీర కణాలలో చక్కెరను పంపిణీ చేయడానికి రూపొందించబడింది. అయినప్పటికీ, రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల, ఇన్సులిన్ స్రావం తక్కువగా ఉంటుంది. ఇది చివరికి ప్యాంక్రియాస్ పనితీరును తగ్గిస్తుంది.

జీవనశైలి విధానాలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన స్వభావాల నుండి చక్కెరను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందుల వల్ల అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ, ప్రీడయాబెటిస్ యొక్క ప్రధాన కారణం ఇప్పటికీ కనుగొనలేకపోయారు.

యువ జనాభాలో ప్రీడయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయ్;

డయాబెటిస్ వ్యాధి సాధారణంగా యువతలో ఉండదని చాలా మంది అపోహపడుతుంటారు. గత దశాబ్దంలో పిల్లలు, కౌమారదశలు, యువకులలో డయాబెటిస్ బారినపడుతున్న వైనం ఆందోళనకరంగా ఉంది.. భారతీయ జనాభాలో 12.3% ప్రీడయాబెటిస్ కలిగి ఉండగా, మొత్తం వ్యాప్తి రేటులో, 8.4% మంది కౌమారదశలో ఉన్నవారు, పెద్దవయస్సులో ఉన్నవారు ఉన్నారు. ఊబకాయం, జన్యు, జీవక్రియ కారకాలు కాకుండా తక్కువ శారీరక శ్రమ, జం, తియ్యటి ఆహారాలు తీసుకోవడంతో అనారోగ్యకరమైన ఆహార పద్ధతులు ప్రీ-డయాబెటిస్ పరిస్థితికి ముఖ్యమైన ప్రమాద కారకాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రీడయాబెటిస్‌ను మధుమేహంగా మారటం అనివార్యం కానందున, ముందస్తుగా గుర్తించడం ద్వారా వ్యాధిని తగ్గించి, నివారించవచ్చు. చాలా సందర్భాలలో ప్రీడయాబెటిస్ లక్షణాలను కనుగొనటం కష్టతరంగా మారుతుంది. అందువల్ల దాని ప్రమాదసంకేతాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రీడయాబెటిస్ ప్రారంభ లక్షణాలు :

తరచుగా టాయిలెట్‌కి వెళ్లడం, ముఖ్యంగా రాత్రిపూట ఈ పరిస్ధితి ఎక్కువగా ఉండటం, ఆకస్మిక బరువు తగ్గడం, జననేంద్రియ దురద, పుండ్లు మరియు గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మసక దృష్టి, విపరీతమైన దాహంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రీడయాబెటిస్‌లో అధిక చక్కెర స్థాయిలు ఇతర అవయవాలను దెబ్బతీస్తాయి, వాటిలో ఒకటి మూత్రపిండాలు. ఈ పరిస్థితి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి కారణమై మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది.

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ ప్రకారం దేశంలో 80 మిలియన్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి 130 మిలియన్లకు చేరుకుంటారని అంచనా వేయబడింది, CKDని నివారించడానికి సరైన సమయంలో సహాయం పొందడం చాలా అవసరం.

రివర్సింగ్ ప్రీడయాబెటిస్ ;

ప్రీ-డయాబెటిస్ రివర్సిబుల్ అంటే చిన్న వయస్సు నుండే మంచి జీవనశైలి అలవరుచుకోవటం చాలా ముఖ్యం. ఆహారంతో సహా కార్బోహైడ్రేట్లు, చక్కెరను తీసుకోవడం నియంత్రించడం ద్వారా పరిస్ధితిని అదుపులో ఉంచుకోవచ్చు. బీన్స్, చిక్కుళ్ళు, లీన్ మాంసం, తృణధాన్యాలు మరియు కాలానుగుణ పండ్లు మరియు కూరగాయలు వంటి పీచుపదార్థాలు తీసుకోవాలి. రోజంతా అనేక సార్లు కొద్దికొద్ది మొత్తంలో భోజనం తీసుకోవాలి. తద్వారా అకాల, అనారోగ్య పరిస్ధితులు రాకుండా చూసుకోవచ్చు. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. దినచర్యలో 30-40 నిమిషాలు వ్యాయామాలు చేయాలి. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.