Anand Mahindra : వాయు కాలుష్యం అరికట్టడానికి ఆనంద్ మహీంద్ర ఇచ్చిన సూపర్ ఐడియా

ఢిల్లీని వాయు కాలుష్యం దట్టగా కమ్మేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఇచ్చిన సలహా వైరల్ అవుతోంది.

Anand Mahindra : వాయు కాలుష్యం అరికట్టడానికి ఆనంద్ మహీంద్ర ఇచ్చిన సూపర్ ఐడియా

Anand Mahindra

Anand Mahindra : ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఓ చక్కని పరిష్కార మార్గం చెప్పారు. ట్విట్టర్‌లో ఆయన షేర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

Anand Mahindra : పారా ఏషియాడ్ స్వర్ణ పతకం సాధించిన శీతల్ దేవి.. ఆమె కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానన్న ఆనంద్ మహీంద్రా

ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టడమే ఈ కాలుష్యానికి కారణం. ఈ పరిస్థితులపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు రీజనరేటివ్ అగ్రకల్చర్ విధానాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఆనంద్ మహీంద్రా తన పోస్టులో ‘ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పునరుత్పత్తి వ్యవసాయానికి అవకాశం ఇవ్వాలి.. ఇది మట్టి ఉత్పాదకతను పెంచుతుంది. పంట వ్యర్థాలను కాల్చడానికి బదులుగా లాభదాయకమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ విషయంలో @naandi_india @VikashAbraham సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.. మనం చేద్దాం’ అనే శీర్షికతో కొందరిని ట్యాగ్ చేశారు.

Anand Mahindra : ముంబయిలో డబుల్ డెక్కర్ బస్సులకు వీడ్కోలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ఢిల్లీ-ఎన్‌సి‌ఆర్‌లో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో నవంబర్ 10 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలకు ఇంటి నుండి పనిని అమలు చేయాలని సూచించింది. నవంబర్ 13 నుండి 20 వరకు సరి-బేసి విధానాన్ని అమలు చేయనుంది.