Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’.. అంటే ఏంటి?

నిల్వ ఉంచిన ఫుడ్ తినేటపుడు ఒక్క క్షణం ఆగండి.. 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' గురించి తెలుసుకోండి.. అసలు దీని లక్షణాలు ఏంటి? సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఎందుకు ట్రెండ్ అవుతోంది? చదవండి.

Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’.. అంటే ఏంటి?

Fried Rice Syndrome

Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ అనే టాపిక్ ట్రెండ్ అవుతోంది. అసలు ఈ సిండ్రోమ్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏంటి? చదవండి.

బాసిల్లస్ సెరియస్ అనే బాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యేదే ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’.  ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైస్, పాస్తా, కూరగాయలు, మాంసం వంటి పదార్ధాలపై బాసిల్లస్ సెరియస్ బాక్టీరియా ఏర్పడవచ్చు. 20 ఏళ్ల బెల్జియన్ విద్యార్ధి మరణానికి సంబంధించిన 2008 కేసు తిరిగి బయటకు రావడంతో ఈ బాక్టీరియా గురించి సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలుపెట్టారు.

Digital Strain : కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ గురించి తెలుసా ? పిల్లలు ,పెద్దలలో దీనిని నివారించటం ఎలా ?

జర్నల్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ ప్రచురించిన ఓ కేసు నివేదిక ప్రకారం విద్యార్ధి ఐదురోజులపాటు కనీసం రిఫ్రిజిరేటర్‌లో కూడా పెట్టని ఆహారాన్ని మైక్రోవేవ్‌లో వేడి చేసి తిన్నాడు. దాంతో తలనొప్పి, వికారం, కడుపునొప్పి వంటి లక్షణాలతో రాత్రి పూట చనిపోయాడు. ఈ సంఘటన జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నా మరోసారి సోషల్ మీడియా పోస్టులు ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ గురించి మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.

‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ అంటే.. బాసిల్లస్ సెరియస్ పర్యావరణం అంతటా కనిపించే సాధారణమైన బాక్టీరియా. వండిన లేదా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయని ఆహారాలపై ఏర్పడవచ్చు. ముఖ్యంగా బియ్యం, పాస్తా, కూరగాయలు, మాంసం వంటి పదార్ధాలను ప్రభావితం చేస్తాయి. బాగా నిల్వ ఉన్న పదార్ధాలను అధిక ఉష్ణోగ్రతలో వేడిచేసినపుడు ఈ బాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Smart Phone Syndrome : కంటిచూపును హరిస్తున్న ‘స్మార్ట్ పోన్ సిండ్రోమ్’, ఇది ఎందుకు వస్తుంది? పరిష్కారం కోసం నిపుణులు సూచనలు..

బాసిల్లస్ సెరియస్ అనేది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే బాక్టీరియా. అయితే రెండు రకాల బాసిల్లస్ సెరియస్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. ఒకటి అతిసారం రెండవది వాంతులు కలిగించేది. ఇది కొన్నిరోజుల్లో నయం అవుతుంది. కానీ రోగ నిరోధక శక్తి సరిగా లేని వ్యక్తులకు వైద్య సహాయం అవసరం పడుతుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా ఉండాలంటే కావాల్సిన మొత్తంలో ఆహారాన్ని తయారు చేసుకోవడం మంచిది. లేదా మిగిలిన ఆహారాన్ని తినకుండా ఉండటానికి ప్రయత్నించండి.