Unstoppable With NBK : బాలయ్య షో కి భారీ ప్లాన్ వేశారుగా!
బాలయ్య టాక్ షో కోసం క్రేజీ సెలబ్రిటీలను తీసుకు రానుంది తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’..
- sekhar
- Updated on- October 10, 2021 / 04:40 PM IST
Ntr Charan
Unstoppable With NBK: నటసింహా నందమూరి బాలకృష్ణ, తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ టాక్ షో తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్గా దీనికి సంబంధించిన ఫొటో షూట్ అండ్ ప్రోమో షూట్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఆదివారం ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’
ఈ సందర్భంగా బాలయ్య షాడోను చూపిస్తూ వదిలిన పోస్టర్ వైరల్‌గా మారడమే కాకుండా #UnstoppableWithNBK #NandamuriBalakrishna #NBKOnAha హ్యాష్ ట్యాగ్స్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత వర్మ ప్రోమో షూట్ చేస్తున్నారు. ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’ అనేలా డిఫరెంట్‌గా ఈ టాక్ షో ను రూపొందిస్తున్నారట.
Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!
బాలయ్య ఫస్ట్ టైమ్ డిజిటల్ ప్లాట్ఫామ్లో షో చెయ్యబోతుండడంతో ప్రోమో ఎలా ఉంటుంది.. ఫస్ట్ గెస్ట్‌గా ఎవరెవరొస్తారు.. అసలు టీం ఏ ఏ స్టార్స్‌ను ఈ షో కు తీసుకురాబోతుంది అనే విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. కట్ చేస్తే ఈ షో కి రాబోతున్న కొందరు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
రెబల్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బాలయ్య షో కి గెస్టులుగా రాబోతున్నారట. ఇప్పటికే ‘ఆహా’ టీం సంప్రందించగా వీరంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
