Jr NTR: పవన్ సినిమాల్లో తారక్‌కి ఇష్టమైన సినిమా ఇదే..!
ఒకప్పుడు తెలుగు సినీ హీరోలు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడంతా భాయి.. భాయి. ఆ మాటకొస్తే గతంలో కూడా హీరోల మధ్య సినిమా వార్ ఉండేది తప్ప పర్సనల్ గా ఎలాంటి ఈగోలు ఉండేది.
- Naresh Mannam
- Published On : November 26, 2021 / 03:54 PM IST
Jr Ntr
Jr NTR: ఒకప్పుడు తెలుగు సినీ హీరోలు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడంతా భాయి.. భాయి. ఆ మాటకొస్తే గతంలో కూడా హీరోల మధ్య సినిమా వార్ ఉండేది తప్ప పర్సనల్ గా ఎలాంటి ఈగోలు ఉండేది. కానీ, అభిమానులు మాత్రం మాటల యుద్ధంతో పాటు కొన్ని సందర్భాలలో కొట్లాటకు కూడా దిగేవారు. కానీ ఇప్పుడు హీరోలే దోస్తీ పాటలు పాడుకోవడంతో అభిమానులు కూడా సామరస్యంగా ఉంటున్నారు. యంగ్ హీరోలైతే బావా, బ్రో అనుకుంటూ కలిసి మెలిసి ఒకరి సినిమాలకు ఒకరు సహకరించుకుంటున్నారు.
Film Releases: కళకళలాడుతున్న థియేటర్లు.. ఈ వారం సినిమాలివే!
మెగా, నందమూరి హీరోల మధ్య ఇప్పుడు పర్సనల్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అల్లు అర్జున్ ఎన్టీఆర్ ను బావా అని సంబంధిస్తూ సందర్భాన్ని బట్టి శుభాకాంక్షలు చెప్తుంటే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. ఇక పవన్-ఎన్టీఆర్ మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది. పలు సందర్భాల్లో ఇది కెమెరాలకు చిక్కి అప్పుడే ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా.. ఇప్పుడు ఎన్టీఆర్ పవన్ సినిమాల గురించి చెప్పిన మాటలు కూడా మరోసారి వైరల్ అవుతున్నాయి.
Film Promotions: ప్రమోషన్లతో మోత మోగించేస్తున్న స్టార్ మూవీస్
ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజా ఎపిసోడ్ లో తారక్ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం పవన్ అభిమానులను ఖుషీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకి బాగా ఇష్టమైన సినిమా ‘తొలిప్రేమ’ అని చెప్పడం ఇద్దరి హీరోల అభిమానులను ఖుషీ చేస్తుంది. పవన్ సినీ కెరీర్ లో తొలిప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. పవన్ తొలి సూపర్ డూపర్ హిట్ సినిమా తొలిప్రేమ. ప్యూర్ లవ్ స్టోరీలో పవన్ నటించిన తొలి సినిమా కూడా అదే.
